Gold Rates: వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..
ABN, Publish Date - Dec 16 , 2024 | 08:51 AM
Gold Rates: బంగారం ప్రియులకు శుభవార్త. పసిడి మరింత దిగొచ్చింది. గోల్డ్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పాలి. ఇంతకీ ఇవాళ తులం బంగారం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..
ఆ మధ్య వరుస షాకులు ఇచ్చిన బంగారం.. ఇప్పుడు భారీగా దిగొచ్చింది. మూడ్నాలుగు రోజులుగా కిందకు వస్తున్న పసిడి ధరలు ఇవాళ మరింత తగ్గాయి. పసిడిని ఇష్టపడే మహిళలకు ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యంగా గత రెండ్రోజులుగా రేట్లలో భారీ మార్పు నమోదైంది. డిసెంబర్ 16 సోమవారం నాడు రూ.1,000 మేరకు బంగారం ధర తగ్గడం విశేషం. మొన్నటి వరకు రూ.80 వేల మార్క్‌ను దాటేందుకు పరుగులు పెట్టిన గోల్డ్ ఇప్పుడు రూ.77 వేలకు సమీపంలోకి వచ్చేసింది.
పోటీపడుతున్న వెండి
పసిడి ధరలు గత మూడ్రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ రెండ్రోజుల్లోనే ఏకంగా మూడు వేల రూపాయల దాకా తగ్గడం గమనార్హం. సోమవారం నాడు చూసుకుంటే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71 వేల 540గా ఉంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.78,030గా నమోదైంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,390గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.77,880 పలుకుతోంది. ధరల తగ్గుదల విషయంలో బంగారంతో వెండి పోటీపడుతోంది. గత రెండ్రోజుల్లో సిల్వర్ రేట్స్ రూ.4,100 మేరకు తగ్గాయి. హైదరాబాద్‌లో ఇప్పుడు కిలో వెండి రూ.99,990 పలుకుతోంది.
Also Read:
టెక్ వ్యూ : నిరోధ స్థాయి 25000
వివోతో డిక్సన్ టెక్ జాయింట్ వెంచర్
ఎన్‌సీఎల్‌ఏటీలో ఈఐహెచ్‌కి చుక్కెదురు
For More Business And Telugu News
Updated Date - Dec 16 , 2024 | 09:22 AM