ఫ్రెషర్స్‌కు హ్యాపీడేస్!
ABN , Publish Date - Aug 22 , 2024 | 06:26 AM
జాబ్ మార్కెట్ క్రమంగా మెరుగుపడుతోంది. అనుభజ్ఞులతో పాటు ఫ్రెషర్లకూ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఫ్రెషర్లను నియమించుకునే ఆలోచనలో ఉన్నట్లు ఓ సర్వేలో పాల్గొన్న 72 శాతం కంపెనీ యాజమాన్యాలు వెల్లడించాయి. ఈ ప్రథమార్ధంతో పోలిస్తే ఫ్రెషర్ల
72 శాతం యాజమాన్యాలు సై టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ నివేదిక
ముంబై: జాబ్ మార్కెట్ క్రమంగా మెరుగుపడుతోంది. అనుభజ్ఞులతో పాటు ఫ్రెషర్లకూ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఫ్రెషర్లను నియమించుకునే ఆలోచనలో ఉన్నట్లు ఓ సర్వేలో పాల్గొన్న 72 శాతం కంపెనీ యాజమాన్యాలు వెల్లడించాయి. ఈ ప్రథమార్ధంతో పోలిస్తే ఫ్రెషర్ల హైరింగ్ యోచనలో ఉన్న కంపెనీల సంఖ్య మరో 4 శాతం పెరగగా.. గత ఏడాది ద్వితీయార్ధంతో పోలిస్తే 7 శాతం పెరిగింది. టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ బుధవారం విడుదల చేసిన ‘కేరీర్ అవుట్‌లుక్ రిపోర్ట్ హెచ్‌వై2’ లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 603 కంపెనీల ప్రతినిధులను సర్వే చేసినట్లు టీమ్‌లీజ్ తెలిపింది. ఫ్రెషర్ల నియామకాలు పెరగనుండటం మంచి సంకేతం. భవిష్యత్‌పై కంపెనీ యాజమాన్యాల్లో పెరుగుతున్న విశ్వాసానికిదే నిదర్శనం. గ్రాడ్యుయేట్లు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇది సరైన సమయమని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ వ్యవస్థాపకులు, సీఈఓ శంతను రూజ్ అన్నారు. ఉద్యోగాల్లో సాంకేతికత, డిజిటల్ నైపుణ్యాలు ముఖ్యభూమిక పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జాబ్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్న గ్రాడ్యుయేట్లు అనుభవపూర్వకమైన విద్యాభ్యాసం ద్వారా అవకాశాలను మెరుగు పరుచుకోవాలని సర్వేలో పాల్గొన్న 70 శాతం యాజమాన్యాలు సూచించగా.. విద్యా సంస్థలు ఇండస్ట్రీతో భాగస్వామ్యం ద్వారా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని 62 శాతం యాజమాన్యాలు సలహా ఇచ్చాయి.