Share News

Holi celebration controversy: హోలీ సంబరాల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - Mar 14 , 2025 | 11:02 AM

Holi celebration controversy: రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాల్లో అంతా మునిగితేలుతుంటే... ఓ గ్రామంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. పోలీసులు వర్సెస్ గ్రామస్తులు అన్నట్లు అక్కడ పరిస్థితులు మారాయి.

Holi celebration controversy: హోలీ సంబరాల్లో  టెన్షన్ టెన్షన్.. ఏం జరిగిందంటే
Holi celebration controversy

నిజామాబాద్, మార్చి 14: రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు (Holi Celebrations) అంబరాన్నంటాయి. ఎక్కడ చూసినా రంగులమయంగా మారిపోయాయి రోడ్లన్నీ. ప్రతీ ఒక్కరూ కూడా హోలీ సంబరాల్లో పాల్గొంటున్నారు. చిన్నా, పెద్దా అంతా కలిసి హోలీ వేడుకల్లో మునిగితేలుతున్నారు. సాధారణంగా హోలీ అంటే ఒకరికి ఒకరు రంగులు పూసుకోవడం, నీళ్లు చల్లుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మాత్రం వింతగా హోలీ వేడుకలు జరుపుకుంటారు అక్కడి ప్రజలు. అలా జరపకపోతే గ్రామానికి మంచి జరగదని వారి నమ్మకం. ప్రతీ యేడు కూడా ఇలాగే ఆ గ్రామస్తులు హోలీ వేడుకలు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం వారి ఆచారానికి బ్రేక్ పడినట్లైంది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామస్తుల ఆచారం ఏంటి.. ఆచారాన్ని ఎవరు అడ్డుకున్నారు.. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హన్స గ్రామంలో హోలీ వేళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోలీ పండుగ నాడు ఆ గ్రామంలో వింత ఆచారాన్ని పాటిస్తుంటారు. ఇది ఇప్పుటిది కాదండోయ్.. దాదాపు వందేళ్ల నుంచే అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు అక్కడి ప్రజలు. పిడుగుద్దులాటతో హోలీ వేడుకలు జరపుకుంటారు గ్రామస్తులు. ప్రతీ సారీ కూడా అలాగే హోలీ సంబరాలు చేసుకుంటారు. కానీ ఈఏడాది మాత్రం వారి ఆచారానికి పోలీసులు బ్రేక్ వేశారు. పిడుగుద్దులాట వద్దంటూ ఖాకీలు నోలీసులు జారీ చేశారు. ఇలా వేడుకలు జరుపుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. పోలీసుల ఆంక్షలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABN Effect: వీఆర్‌‌కు సీఐ భుజంగరావు


పిడుగుద్దలాట నిర్వహించకపోతే గ్రామానికి అరిష్టమని గ్రామస్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో ఆంక్షలు విధించినా ఆట ఆపేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. వందేళ్లుగా జరుగుతున్న ఆచారాన్ని ఎలా అడ్డుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకోవడం సమంజసం కాదని వారు వాపోతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో అయినా తమ ఆచారాన్ని కొనసాగిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలాంటి ఆచారాన్ని తాము అంగీకరించేది లేదని మరోవైపు పోలీసులు కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రామంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు కాప్స్. పోలీసుల తీరుపట్ల గ్రామాస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే పోలీసుల ఆంక్షలకు తలొగ్గి గ్రామస్తులు ఆటను విరమించుకుంటారా లేక.. ఆచారాన్ని కొనసాగిస్తారా అనేది ఉత్కంఠగా మారింది.


ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: జనసేన పవర్ ముందు జగన్ డీలా.. నాడు అలా.. నేడు ఇలా

Holi - Water Borne Infections: హోలీ పండగ ఎంజాయ్ చేస్తున్నారా.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇదే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 14 , 2025 | 11:05 AM