ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HDFC Bank: కస్టమర్లకు షాక్ ఇచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..

ABN, Publish Date - Nov 04 , 2024 | 05:22 PM

భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. UPI సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు ప్రస్తుతం ట్రెండ్‌గా మారిపోయాయి. కిరాణా దుకాణాలు, షాపింగ్ మాల్స్, క్యాబ్ సర్వీసులు, టిఫిన్ సెంటర్లు సహా ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులే చేస్తున్నారు. నిజం చెప్పాలంటే నేటి సమాజంలో ఎవరూ డబ్బులు చేతిలో పట్టుకుని తిరగడం లేదంటే అతిశయోక్తి కాదు. కేవలం ఫోన్‌ ఉంటే చాలు. ఫోన్ పే, గూగుల్ పే, వాట్సాప్ వంటి యాప్స్ ద్వారా నగదు లావాదేవీలు చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూపీఐ చెల్లింపులు ఆగిపోతే ఇంకేమైనా ఉందా?. అలాంటి షాకింగ్ న్యూసే ఓ బ్యాంకింగ్ సంస్థ చెప్పింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండ్రోజులపాటు యూపీఐ సేవలు నిలిపివేస్తున్నట్లు చెప్పి కస్టమర్లకు షాక్ ఇచ్చింది.


సేవలకు అంతరాయం..

భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. UPI సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సిస్టమ్ నిర్వహణ కారణంగా నవంబర్ నెలలో రెండ్రోజులపాటు సేవలు అందుబాటులో ఉండదని చేదు కబురు చెప్పింది. నవంబర్ 5 (మంగళవారం), నవంబర్ 23 (శనివారం) రోజుల్లో యూపీఐ సేవలకు అంతరాయం కలుగుతుందని, కస్టమర్లు సహకరించాలని యాజమాన్యం కోరింది. నవంబర్ 5న అర్ధరాత్రి 12:00 నుంచి 2:00 గంటల వరకూ యూపీఐ సేవలకు అంతరాయం కలుగుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. అలాగే నవంబర్ 23న అర్ధరాత్రి 12:00 నుంచి 3 గంటల వరకూ సేవలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు.


ఏఏ సేవలకు అంతరాయం అంటే..

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సేవల విషయంలో కరెంట్, సేవింగ్స్ ఖాతాలు, రూపే క్రెడిట్ కార్డులకు సంబంధించిన UPI లావాదేవీలకు అంతరాయం కలుగుతుంది.

  • HDFC బ్యాంక్ UPI హ్యాండిల్‌ ఉపయోగించే ఖాతాదారులందరూ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా చెల్లింపులు చేయలేరు. గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్, పేటీఎం, శ్రీరామ్ ఫైనాన్స్, మొబిక్విక్, క్రెడిట్ పే వాడే వారి ఆర్థిక, ఆర్థికేతర UPI లావాదేవీలు పని చేయవని బ్యాంక్ యాజమాన్యం తెలిపింది.

  • అలాగే HDFC బ్యాంక్ ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్న వ్యాపారులకూ యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని వెల్లడించారు.


యూపీఐ లావాదేవీల పరిమితి..

ఇదిలా ఉండగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గత అక్టోబర్ నెలలో యూపీఐ లావాదేవీల పరిమితి పెంచింది. UPI 123 పే లావాదేవీల పరిమితి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచింది. అదే విధంగా పిన్ లేని UPI లైట్ ఆఫ్ లైన్ లావాదేవీల పరిమితిని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచింది.

Updated Date - Nov 04 , 2024 | 05:32 PM