Cryptocurrency: క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు చేస్తున్నారా.. ఎంత పన్ను చెల్లించాలో తెలుసా
ABN, Publish Date - Dec 11 , 2024 | 02:33 PM
ఇటివల కాలంలో దేశంలో అనేక మంది క్రిప్టోకరెన్సీపై పెట్టుబడులు చేస్తున్నారు. తాజాగా భారీ రాబడులు రావడంతో మరింత ఎక్కువ మంది దీనిపై మక్కువ చూపుతున్నారు. అయితే క్రిప్టోకరెన్సీపై ఇండియాలో ఆమోదం ఉందా, దీనిపై పన్ను విధానాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి బిట్‌కాయిన్‌తో సహా అనేక క్రిప్టోకరెన్సీ(Cryptocurrency)ల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ క్రమంలోనే ఇటివల బిట్‌కాయిన్ ధర లక్ష డాలర్లు దాటేసింది. దీంతో మరోసారి పెట్టుబడిదారులు క్రిప్టోకరెన్సీపై ఫోకస్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కూడా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు చేస్తే భారతదేశంలో ఎంత పన్ను చెల్లించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే భారతదేశంలో క్రిప్టోకరెన్సీ చట్టబద్ధం కాదు. కానీ పెట్టుబడులపై మాత్రం ఎలాంటి పరిమితి లేదు.
భారీగా పన్ను చెల్లింపు
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 2(47A) ప్రకారం వర్చువల్ డిజిటల్ ఆస్తులుగా వర్గీకరించబడిన క్రిప్టోకరెన్సీలను భారతదేశంలో ఇంకా అధికారికంగా గుర్తించలేదు. అయినప్పటికీ వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA)పై పన్ను విధించడం జరుగుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 115BBH, సెక్షన్ 194S ప్రకారం VDAని విక్రయించడం ద్వారా వచ్చే లాభంపై 30% ఫ్లాట్ టాక్స్, లావాదేవీపై 1% పన్ను మినహాయింపు (TDS) ఉంటుంది. అంటే మీరు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టి, దాని నుంచి లాభం పొందినట్లయితే వచ్చిన ఆదాయాలపై 30% చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
నకిలీ చేయలేమా..
క్రిప్టోకరెన్సీ అనేది క్రిప్టోగ్రఫీ ద్వారా భద్రపరచబడిన డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ. వీటిని నకిలీ చేయడం లేదా రెండుసార్లు ఉపయోగించడం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు. వీటిని బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి వికేంద్రీకృత నెట్‌వర్క్‌లలో రూపొందించారు. Blockchain అనేది Bitcoin వంటి కరెన్సీలకు సహాయపడే సాంకేతిక టెక్నాలజీ. వీటి విషయంలో భారతదేశం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను సైతం సిద్ధం చేస్తోంది. క్రిప్టోకరెన్సీ ద్వారా వచ్చే లాభాలపై 2022లో 30 శాతం పన్ను విధించాలని ప్రభుత్వం ప్రకటించింది.
బిట్‌కాయిన్ చట్టపరమా, చట్టవిరుద్ధమా?
ప్రస్తుతం RBI, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో కూడిన ఒక అంతర్ మంత్రిత్వ బృందం (IMG) క్రిప్టోకరెన్సీల కోసం ఒక సమగ్ర విధానాన్ని పరిశీలిస్తోంది. IMG దీనిపై ఎలాంటి చర్చా పత్రాన్ని ఇంకా విడుదల చేయలేదు. ఇది క్రిప్టో కరెన్సీలపై భారతదేశ విధాన వైఖరిపై నిర్ణయం తీసుకునే ముందు వాటాదారులకు వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఇస్తుంది. క్రిప్టోకరెన్సీల నుంచి వచ్చే ఆదాయంపై పన్ను విధించినప్పటికీ, దేశంలో మాత్రం వీటికి చట్టబద్ధత లేదు. అయితే ఈ కరెన్సీకి చట్టబద్ధత లేకున్నా కూడా పన్ను విధించడం ఎందుకని పలువురు ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Free Government Schemes: ఉచిత పథకాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక శాఖ.. కారణమిదే..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 11 , 2024 | 02:37 PM