Multibagger Stock: మల్టీబ్యాగర్ లిస్ట్‌లోకి హైదరాబాద్ స్టాక్.. మూడేళ్లలోనే రూ.119 నుంచి రూ.668కి
ABN, Publish Date - Aug 07 , 2024 | 05:03 PM
స్టాక్ మార్కెట్లో(stock market) అనేక మంది పెట్టుబడిదారులు ప్రతి ఏడాది మల్టీబ్యాగర్ స్టాక్‌ల(Multibagger Stock) కోసం వెతుకుతుంటారు. ఎందుకంటే ఈ స్టాక్స్‌పై పెట్టుబడి చేస్తే తక్కువ సమయంలోనే మంచి లాభాలను పొందవచ్చు. ఈ జాబితాలో ప్రస్తుతం హైదరాబాద్(hyderabad)లో కూడా ఓ కేంద్రం ఉన్న ఈ కంపెనీ చేరింది. ఈ సంస్థ గత మూడేళ్లలో మదుపర్లకు 460 శాతం లాభాలను అందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
స్టాక్ మార్కెట్లో(stock market) అనేక మంది పెట్టుబడిదారులు ప్రతి ఏడాది మల్టీబ్యాగర్ స్టాక్‌ల(Multibagger Stock) కోసం వెతుకుతుంటారు. ఎందుకంటే ఈ స్టాక్స్‌పై పెట్టుబడి చేస్తే తక్కువ సమయంలోనే మంచి లాభాలను పొందవచ్చు. ఈ జాబితాలో ప్రస్తుతం హైదరాబాద్(hyderabad)లో కూడా ఓ కేంద్రం ఉన్న ఈ కంపెనీ చేరింది. ఈ సంస్థ గత మూడేళ్లలో మదుపర్లకు 460 శాతం లాభాలను అందించింది. అయితే ఆ కంపెనీ ఏంటి, స్టాక్ ధర ఎంత పెరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అదే త్రివేణి టర్బైన్ లిమిటెడ్(Triveni Turbine Ltd) సంస్థ. ఈ కంపెనీ షేర్లు బుధవారం రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం.
గత రెండేళ్లలో
బుధవారం ఒక్కరోజే కంపెనీకి చెందిన మొత్తం 1.02 లక్షల షేర్లు రూ.6.63 కోట్ల టర్నోవర్‌తో చేతులు మారాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ రూ.20,410 కోట్లకు పెరిగింది. అక్టోబర్ 26, 2023న షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ.311.85గా ఉండేది. జూన్ 3, 2024న రూ.675 వద్ద 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ స్టాక్ గత రెండేళ్లలో 238% రాబడిని అందించింది. ఆ క్రమంలోనే మూడేళ్లలో 460% పెరిగింది.
ఆగస్ట్ 6, 2021న ఈ కంపెనీ స్టాక్ ధర రూ.119.2 వద్ద ఉండగా, ప్రస్తుత సెషన్‌లో (ఆగస్టు 7, 2024) నాటికి గరిష్టంగా రూ.668కి చేరుకుంది. ఈ సమయంలో కంపెనీ షేర్లలో పెట్టుబడులు చేసిన మదుపర్లు ఏకంగా మూడేళ్లలో 460% రాబడులను అందుకున్నారు. అంటే మూడేళ్ల క్రితం ఈ కంపెనీ షేర్లలో 5 లక్షల రూపాయలు పెట్టుబడి చేసిన వారికి ప్రస్తుతం 23 లక్షలు వచ్చాయని చెప్పవచ్చు. దీంతో ఈ సంస్థలో పెట్టుబడి చేసిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నికర లాభం
జూన్ 2024 త్రైమాసికంలో త్రివేణి టర్బైన్ జూన్ 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ. 60.96 కోట్ల లాభంతో పోలిస్తే 32% నికర లాభం రూ. 80.41 కోట్లకు పెరిగింది. జూన్ 2023తో ముగిసిన త్రైమాసికంలో అమ్మకాలు క్యూ1లో రూ. 389.77 కోట్ల నుంచి రూ. 482.67 కోట్లకు పెరిగాయి. ఈ కంపెనీలో జూన్ 2024తో ముగిసిన త్రైమాసికంలో ఏడుగురు ప్రమోటర్లు 55.84 శాతం వాటాను కలిగి ఉన్నారు. 1,07,617 పబ్లిక్ షేర్‌హోల్డర్లు సంస్థలో 44.16 శాతం లేదా 14.03 కోట్ల షేర్లను కలిగి ఉండగా, వీరిలో 1,03,912 మంది నివాసితులు 1.16 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు.
త్రివేణి టర్బైన్ షేర్లు 5 రోజులు, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, 200 రోజుల చలన సగటు కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ స్టాక్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: మాకు లభించిన సమాచారం ఆధారంగా ఈ స్టాక్ గురించి తెలుపడం జరుగుతుంది. కానీ పెట్టుబడి చేయాలని కాదు. మీరు ఇన్వెస్ట్ చేయదలిస్తే నిపుణుల సలహాలు తీసుకుని చేయాలని సూచన.
ఇవి కూడా చదవండి:
Alert: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులో ఉపశమనం.. ఎప్పటివరకంటే
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Aug 07 , 2024 | 07:02 PM