IRCTC: హైదరాబాద్ టూ కాశీ యాత్ర టూర్ ప్యాకేజీ.. ఎన్ని రోజులు, ఖర్చు ఎంతంటే..
ABN, Publish Date - Sep 29 , 2024 | 01:42 PM
శివుని నగరాన్ని ప్రస్తుతం వారణాసి, బనారస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పురాతన, పవిత్ర నగరాన్ని సందర్శించాలని అనేక మంది భావిస్తారు. అయితే హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఎలా అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు రానే వచ్చేశాయ్. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి టూర్లకు వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారికి ఇది మంచి ఛాన్స్. ఎందుకంటే ఇదే సమయంలో ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలోని IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. వాటిలో భాగంగా అక్టోబర్ 6, 2024 నుంచి JAI KASHI VISWANATH GANGE పేరుతో ఒక స్పెషల్ టూర్ మొదలుకానుంది. అయితే టూర్ ఎన్ని రోజులు ఉంటుంది. పిల్లలు, పెద్దలకు ఎంత ఖర్చు అవతుంది. టూర్ ఎన్ని రోజులపాటు ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఆరు రోజుల్లో
IRCTC ఈ ట్రెయిన్ టూర్ ప్యాకేజీ పేరు JAI KASHI VISWANATH GANGE (SHR048). ఈ ప్యాకేజీ 6 రోజుల్లో 5 రాత్రులపాటు కొనసాగుతుంది. ఇది అక్టోబర్ 6, 2024న సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది. దీనిలో మీరు వారణాసి, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీలో మీకు 3 బ్రేక్‌ఫాస్ట్‌లు లభిస్తాయి. ఈ ప్రత్యేక ఎయిర్ టూర్ ప్యాకేజీ గురించి థర్డ్ క్లాస్ ఏసీ ధరలు చూస్తే సింగిల్ బుకింగ్‌పై మీరు రూ. 35,330 చెల్లించాలి. డబుల్ షేరింగ్‌కు రూ. 21,200, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 17,640 ఖర్చు అవుతుంది. దీంతోపాటు 5 ఏళ్ల నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్ తీసుకోకుంటే రూ.13,480, 5 ఏళ్ల నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్ తీసుకోకుంటే రూ.11,990.
స్లిపర్ క్లాస్ రేట్లు
ఇక స్లిపర్ క్లాస్ విషాయానికి వస్తే సింగిల్‌గా ప్రయాణిస్తే మీరు రూ. 21,490 చెల్లించాలి. డబుల్ షేరింగ్‌కు రూ. 16,480, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 15,930 పే చేయాలి. దీంతోపాటు 5 ఏళ్ల నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్ తీసుకోకుంటే రూ.12,350, 5 ఏళ్ల నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్ తీసుకోకుంటే రూ.10,870 చెల్లించుకోవాలి. ఈ ఎయిర్ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే IRCTC అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు.
వారణాసి ప్రాముఖ్యత
వారణాసి భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున ఉన్న చాలా అందమైన నగరం. ఇది హిందువులకు చాలా ప్రత్యేకమైన యాత్రాస్థలంగా ప్రసిద్ధి చెందింది. కాశీ విశ్వనాథ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అస్సీ ఘాట్ మహాకవి తులసీదాస్ మరణించిన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశం దక్షిణ ఘాట్ పర్యాటకులలో అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశాన్ని చూడటానికి వచ్చే వారి సంఖ్య ప్రతిరోజూ గంటకు పెరుగుతూనే ఉంటుంది. పండుగల సమయాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఇక్కడ అనేక దేవాలయాలతో పాటు, వారణాసి ఘాట్‌లు, అనేక ఇతర ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. మీరు కూడా మీ కుటుంబంతో కలిసి ఈ ప్రదేశానికి వెళ్లి సందర్శించవచ్చు.
ఇవి కూడా చదవండి:
Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
Utility News: మీ స్మార్ట్‌ఫోన్ స్లోగా ఉందా.. ఈ సెట్టింగ్స్ చేస్తే నిమిషాల్లోనే సూపర్‌ఫాస్ట్..
Financial Deadline: ఈ లావాదేవీలకు ఈ నెల 30 చివరి తేదీ.. లేదంటే మీకే నష్టం..
Read More Business News and Latest Telugu News
Updated Date - Sep 29 , 2024 | 01:43 PM