Indias Foreign Exchange Reserves: ఆల్ టైమ్ రికార్డుకు భారత విదేశీ ద్రవ్య నిల్వలు.. ఎంతకు చేరాయంటే..
ABN, Publish Date - Oct 04 , 2024 | 08:11 PM
దేశంలో మోదీ ప్రభుత్వం మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ క్రమంలోనే విదేశీ మారక నిల్వలు సరికొత్త జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో బంగారం నిల్వలు కూడా పుంజుకున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం రండి.
భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్‌టైం గరిష్టానికి చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించాయి. సెప్టెంబర్ 27తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 12.59 బిలియన్ డాలర్లు పెరిగి కొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి 704.88 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత వారంలో $12.59 బిలియన్ల పెరుగుదల ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద పెరుగుదలలో ఒకటని ఆర్బీఐ(RBI) తెలిపింది. అంతేకాదు భారతదేశ విదేశీ మారక నిల్వలు మొదటిసారిగా 700 బిలియన్ డాలర్లు దాటడం విశేషం.
నాలుగో దేశంగా
దీంతో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత 700 బిలియన్ డాలర్ల నిల్వలను దాటిన నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. 2013 నుంచి విదేశీ మారకద్రవ్య నిల్వలను పెంచుకోవడంపై దేశం దృష్టి సారిస్తోంది. బలహీనమైన స్థూల ఆర్థిక పరిస్థితి కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పుడు ఈ ధోరణి ప్రారంభమైంది. అంతకుముందు, సెప్టెంబర్ 20తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు 2.8 బిలియన్ డాలర్లు పెరిగి 692.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
గత కొన్ని వారాలుగా
గత వారం (సెప్టెంబర్ 20తో ముగిసిన వారం) దేశ విదేశీ మారక నిల్వలు 2.84 బిలియన్ డాలర్లు పెరిగి 692.29 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సెప్టెంబరు 13తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు $223 మిలియన్లు పెరిగి సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి $689.46 బిలియన్లకు చేరాయి. అంతకుముందు సెప్టెంబర్ 6తో ముగిసిన వారంలో భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు 5.25 బిలియన్ డాలర్లు పెరిగి 689.23 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
గోల్డ్ కూడా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కరెన్సీ నిల్వలలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడే విదేశీ కరెన్సీ ఆస్తులు సెప్టెంబర్ 27తో ముగిసిన వారంలో 10.47 బిలియన్ డాలర్లు పెరిగి 616.15 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో దేశంలోని బంగారం నిల్వల విలువ కూడా 2.18 బిలియన్ డాలర్లు పెరిగి 65.79 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతేకాకుండా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDR) $8 మిలియన్లు పెరిగి $18.55 బిలియన్లకు చేరుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం సెప్టెంబర్ 27తో ముగిసిన వారంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వద్ద భారతదేశ నిల్వలు 71 మిలియన్ డాలర్లు తగ్గి 4.39 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఇవి కూడా చదవండి:
Nissan Magnite Facelift: రూ. 5.99 లక్షలకే నిస్సాన్ మాగ్నైట్ కొత్త మోడల్.. దీని స్పెషల్ ఏంటంటే
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Loans: గూగుల్ పే నుంచి క్షణాల్లోనే రూ. 50 లక్షల లోన్స్
Read More Business News and Latest Telugu News
Updated Date - Oct 04 , 2024 | 08:13 PM