IRCTC: భక్తులకు గుడ్ న్యూస్.. జ్యోతిర్లింగాల దర్శనం కోసం స్పెషల్ యాత్ర
ABN, Publish Date - Apr 30 , 2024 | 10:38 AM
మహాదేవ్ భక్తులకు(devotees) గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శనం కోసం IRCTC దేవ్ దర్శన్ యాత్ర(dev darshan yatra)ను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దేవ్ దర్శన్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, జోషిమత్ సహా దేశంలోని అనేక జ్యోతిర్లింగ ఆలయాలను సూపర్ లగ్జరీ రైల్వే ప్రయాణం ద్వారా చుట్టిరావచ్చు.
మహాదేవ్ భక్తులకు(devotees) గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాల దర్శనం కోసం IRCTC దేవ్ దర్శన్ యాత్ర(dev darshan yatra)ను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దేవ్ దర్శన్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, జోషిమత్ సహా దేశంలోని అనేక జ్యోతిర్లింగ ఆలయాలను సూపర్ లగ్జరీ రైల్వే ప్రయాణం ద్వారా చుట్టిరావచ్చు. బాబా విశ్వనాథ్, కాశీ కారిడార్, వారణాసిలోని గంగా హారతి దర్శనం కోసం భారతీయ రైల్వే వచ్చే నెల నుంచి సూపర్ లగ్జరీ రైలును నడపబోతోంది.
ఐఆర్‌సీటీసీ(IRCTC) రామాయణ సర్క్యూట్ యాత్ర విజయవంతం కావడంతో జూన్ 28 నుంచి దేవ్ దర్శన్ యాత్ర కోసం సూపర్ లగ్జరీ ఎసీ రైలును ప్రారంభించాలని నిర్ణయించినట్లు రైల్వే సీనియర్ అధికారులు తెలిపారు. ఈ లగ్జరీ రైలులో AC-1 క్యాబిన్‌తో పాటు AC-2, AC-3 క్లాస్ కోచ్‌లు ఉంటాయని అన్నారు. ట్రేలో ఆన్‌బోర్డ్ రెస్టారెంట్ కూడా ఉంటుందని చెప్పారు. AC-1, AC-2 యాత్రికులు రెస్టారెంట్‌లో కూర్చుని ఉదయం, సాయంత్రం అల్పాహారం, ఆహారం, టీ, కాఫీని ఆస్వాదించవచ్చని అన్నారు. అయితే AC 3లోని శివ భక్తులకు మాత్రమే వారి బెర్త్‌ల వద్దకు ఆహారం, టీ, స్నాక్స్ మొదలైనవి ఇవ్వబడతాయని చెప్పారు.
దేవ్ దర్శన్ రైలు ప్రయాణం ఢిల్లీ(delhi)లోని సఫ్దర్‌జంగ్ మొదలవుతుందని అధికారులు అన్నారు. యాత్రికులు ఘజియాబాద్, మీరట్, ముజఫర్‌నగర్ నుంచి రైలు ఎక్కవచ్చన్నారు. ఆ క్రమంలో రాజ్‌కోట్, పాలన్‌పూర్, అజ్మీర్, రేవానీ, జోషిమఠ్, బద్రీనాథ్, రిషికేశ్, వారణాసి, కాంచీపురం, రామేశ్వరం, పూణే, నాసిక్, ద్వారకాధీష్ మీదుగా వెళ్లి ఢిల్లీలో ముగుస్తుంది.
17 రోజుల ప్రయాణంలో, జోషిమత్, రిషికేశ్, కాచీపురం, రామేశ్వరం, పూణే, ద్వారకాధీష్, వారణాసి, నాసిక్‌లోని డీలక్స్ కేటగిరీ హోటళ్లలో ఒకటి నుంచి రెండు రాత్రి బస, జ్యోతిర్లింగ ఆలయాల సందర్శన ఉంటుంది. ఇక ధరల విషయానికి వస్తే సూపర్ లగ్జరీ రైలులో ఏసీ-1 ధర రూ. 1,55,740 నుంచి 1,80,440 లక్షలు, ఏసీ-2 రూ. 1,44,325 నుంచి 1,67,725 లక్షలు, ఏసీ-3 రూ. 83,970 నుంచి 95,520. అన్ని కోచ్‌లలో ఎలక్ట్రానిక్ లాకర్, CCTV కెమెరాల సౌకర్యం కూడా ఉంటుంది.
ఇది కూడా చదవండి:
IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
Read Latest Business News and Telugu News
Updated Date - Apr 30 , 2024 | 10:49 AM