IRCTC: హైదరాబాద్ టూ ఊటీ 6 రోజుల టూర్ ప్లాన్..బడ్జెట్ ఏంతంటే
ABN, Publish Date - Apr 27 , 2024 | 01:35 PM
వేసవి సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో మీ పిల్లలతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే మీకు తక్కువ బడ్జెట్‌లో హైదరాబాద్(hyderabad) నుంచి వెళ్లే మంచి టూర్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో మీ పిల్లలతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే మీకు తక్కువ బడ్జెట్‌లో హైదరాబాద్(hyderabad) నుంచి వెళ్లే మంచి టూర్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే IRCTC అల్టీమేట్ ఎక్స్ హైదరాబాద్ ఊటీ టూర్(Ooty tour) ప్లాన్. దీనిలో ఊటీతో పాటు కూనూర్‌ను(COONOOR) కూడా సందర్శించే అవకాశం ఉంది. ఈ పూర్తి ట్రైన్ టూర్ ప్యాకేజీ 6 రోజులు, 5 రాత్రులు ఉంటుంది. దీనిలో తమిళనాడులో ఉన్న ఊటీతోపాటు అక్కడ పచ్చని పచ్చిక బయళ్ళు, ఆహ్లాదకరమైన వాతావరణం, పూల అందాలు మిమ్మల్ని వీక్షించవచ్చు.
ఈ ప్యాకేజీలో మీరు 3 బ్రేక్‌ఫాస్ట్‌లు 3 డిన్నర్ల సౌకర్యాన్ని పొందనున్నారు. ఈ ప్యాకేజీలో ప్రయాణీకులందరికీ ప్రయాణ బీమా(insurance) సౌకర్యం లభిస్తుంది. దీంతో పాటు టూర్ మేనేజర్ సౌకర్యం కూడా ట్రిప్ అంతటా అందుబాటులో ఉంటుంది. ఈ ట్రిప్‌కు ఎక్కువ ఖర్చు ఉండదు. అంతేకాదు మీరు ఈ టూర్‌ను హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రతి మంగళవారం సికింద్రాబాద్ నుంచి 12.20 గంటలకు ఈ టూర్ ట్రైన్ బయలుదేరుతుంది.
ఈ టూర్ ప్యాకేజీ కోసం నలుగురి నుంచి ఆరుగురు వెళ్లే విభాగంలో స్లిపర్ క్లాసులో ట్విన్ షేరింగ్(Twin Sharing)లో రూ.14,470 చెల్లించాలి. అదే సమయంలో ట్రిపుల్ ఆక్యుపెన్సీ(Triple Sharing)కి రూ.12,120 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలు ఉండి వారి కోసం బెడ్ కావాలంటే రూ.6,970 అదనంగా చెల్లించాలి. ఇక త్రి టైర్ ఏసీ కోచ్‌లో ప్రయాణం కోసం ట్విన్ షేరింగ్‌లో రూ.16,690 చెల్లించాలి. అదే సమయంలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.14,580 పే చేయాలి. పిల్లలు ఉండి వారి కోసం బెడ్ కావాలంటే రూ.9,430 అదనంగా చెల్లించాలి.
ఇది కూడా చదవండి:
IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
Read Latest Business News and Telugu News
Updated Date - Apr 27 , 2024 | 01:37 PM