Business Idea: రైల్వేలో ఈ బిజినెస్ చేయండి.. వేల సంపాదనతోపాటు..
ABN, Publish Date - Oct 13 , 2024 | 10:21 AM
రైల్వేలో మీకు వ్యాపారం చేయాలని ఉందా. అయితే ఈ న్యూస్ మీ కోసమే. ఎందుకంటే దీని ద్వారా మీరు ప్రతి నెల డబ్బు సంపాదించడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ వ్యాపారం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఆదాయం ఎలా ఉంటుందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
మీరు ఏదైనా ఉద్యోగం చేస్తూనే వ్యాపారం(business) చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే వ్యాపారాన్ని మీరు ఏదైనా జాబ్ చేస్తూ కూడా కొనసాగించవచ్చు. అయితే ఈ వ్యాపారం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఆదాయం ఎలా ఉంటుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అనేది రైల్వేలకు అందించే సేవ. ఇది రైలు టికెట్ బుకింగ్ సహా అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. IRCTC సహాయంతో మీరు ప్రతి నెలా వేల రూపాయలు సంపాదించవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు టిక్కెట్ ఏజెంట్‌గా మారాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు టిక్కెట్లను ఇంటి దగ్గర లేదా మీకు నచ్చిన చోటి నుంచి బుకింగ్స్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు.
కమీషన్ పొందండి
మీరు ఈ టిక్కెట్లను ప్రయాణీకులకు అందించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు మొదటగా IRCTC వెబ్‌సైట్‌కి వెళ్లి ఏజెంట్‌గా మారడానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ అవుతారు. అప్పుడు టిక్కెట్లు బుక్ చేసుకుని నెలకు లక్షల రూపాయలు ఆర్జించవచ్చు. ఈ క్రమంలో ఏ ప్రయాణికుడికైనా నాన్ ఏసీ కోచ్ టిక్కెట్‌ను బుక్ చేస్తే టికెట్‌కు రూ.20, ఏసీ క్లాస్ టిక్కెట్‌ను బుక్ చేస్తే టిక్కెట్‌కు రూ.40 కమీషన్ అందజేస్తారు. ఇది కాకుండా టికెట్ ధరలో ఒక శాతం ఏజెంట్‌కు ఇవ్వబడుతుంది.
ఆదాయం
IRCTCకి ఏజెంట్‌గా మారడం వల్ల వచ్చే మరో అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే టిక్కెట్‌ల బుకింగ్‌పై పరిమితి ఏమి ఉండదు. నెలలో మీకు కావలసినన్ని టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇది కాకుండా మీరు 15 నిమిషాల్లోనే తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఏజెంట్‌గా మీరు రైళ్లతో పాటు దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్‌లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ వ్యాపారంలో మీరు ట్రైన్ టిక్కెట్లతోపాటు ఫ్లైట్ టిక్కెట్లు కూడా బుక్ చేస్తే మీకు మరింత ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సుమారుగా నెలకు 100 ఏసీ టిక్కెట్లను బుక్ చేస్తే మీరు రెండు వేల రూపాయలు పొందుతారు. పండుగలు లేదా హాలిడే సీజన్లలో మీరు ఎక్కువగా సంపాదించుకోవచ్చు.
ఖర్చు ఎంత
మీరు ఒక సంవత్సరానికి ఏజెంట్‌గా మారాలనుకుంటే IRCTCకి రూ. 3,999 రుసుము చెల్లించాలి. రెండు సంవత్సరాలకు ఛార్జ్ రూ. 6,999. మీరు ఏజెంట్‌గా మారిన తర్వాత నెలలో 100 టిక్కెట్లు బుక్ చేసుకుంటే ఒక్కో టిక్కెట్టుకు రూ.10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నెలలో 101 నుంచి 300 టికెట్లు బుక్ చేసుకునేందుకు ఒక్కో టిక్కెట్టుకు రూ.8, నెలలో 300 కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేసుకుంటే రూ.5 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో టికెట్ బుకింగ్‌పై ఎలాంటి పరిమితి ఉండదు. నెలలో ఎన్ని టిక్కెట్లనైనా బుక్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
Read More Business News and Latest Telugu News
Updated Date - Oct 13 , 2024 | 10:23 AM