ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..

ABN, Publish Date - Oct 19 , 2024 | 05:33 PM

దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మహిళలకు వ్యాపారం కోసం 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తుంది. అయితే దీని కోసం ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Personal Finance news

భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇదే సమయంలో వివిధ రకాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాలను తీసుకోస్తోంది. ప్రభుత్వ పథకాలు చాలా వరకు పేదలు, నిరుపేదల కోసమే ఉన్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. దీంతోపాటు మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు వివిధ రకాల పథకాలను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహిళలను ఆర్థికంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు భారత ప్రభుత్వం ఇటివల కొత్త పథకాన్ని ప్రారంభించింది. అదే లఖ్‌పతి దీదీ యోజన స్కీం.


ఎవరు అర్హులు

దీని ద్వారా ప్రభుత్వం మహిళలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తుంది. అయితే ఈ పథకాన్ని మహిళలు ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు. ఎలా వారి వ్యాపారాన్ని ఎలా సెటప్ చేసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ పథకం లక్ష్యం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, వ్యాపారాలను స్థాపించడంలో వారికి సహాయం చేయడం. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు మహిళలు స్వయం సహాయక గ్రూపులలో చేరి ఉండాలి. ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళల కోసం రూపొందించబడ్డాయి. ఈ బృందంలోని ఒక మహిళ తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఆమె తన వ్యాపార ప్రణాళికతో స్వయం సహాయక బృందం ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


ఇలా దరఖాస్తు చేసుకోండి

ఆయా బృందంలోని మహిళా సభ్యుల వ్యాపార ప్రణాళికను స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రభుత్వానికి పంపించాలి. ప్రభుత్వ అధికారులు వారి దరఖాస్తును పరిశీలిస్తారు. ఆ తర్వాత దరఖాస్తు ఆమోదం పొందితే రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం లభిస్తుంది. దీంతోపాటు మీరు లోన్ పొందిన తర్వాత అవసరైన శిక్షణను కూడా ప్రభుత్వం అందిస్తుంది. ఆయా కంపెనీ కోసం అవసరమైన నైపుణ్యాలను మెరుగుపర్చుకునే అవకాశం కల్పిస్తుంది.


ఇదివరకే లోన్

లఖ్‌పతి దీదీ యోజన స్కీం ఆధ్వర్యంలో మహిళలకు ప్రయోజనాలను అందించడానికి స్వయం సహాయక బృందంలో చేరి ఉండాలి. ఒక వేళ వారి బృందంలోని సభ్యులు ఇదివరకు లోన్ తీసుకుని ఉంటే మాత్రం మళ్లీ కొత్తగా లోన్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. పాత లోన్ గడువులోగా తీర్చడం లేదా వాయిదాలు క్రమంగా కట్టడం ద్వారా వారికి మరిన్ని లోన్ సౌకర్యాలు లభిస్తాయి.


ఇవి కూడా చదవండి:

Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..


Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్‌‌కు భారీ షాక్.. 11 నెలల కనిష్టానికి షేర్లు


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 19 , 2024 | 05:35 PM