Lay Offs: మళ్లీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో లే ఆఫ్స్.. భయాందోళనలో టెకీలు..
ABN, Publish Date - Oct 17 , 2024 | 04:26 PM
టెక్ ఇండస్ట్రీలో మళ్లీ లే ఆఫ్‌ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మెటా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్‌ల కోసం పని చేస్తున్న టీమ్‌ల నుంచి అనేక మంది ఉద్యోగులతో సహా మెటా వర్స్‌లో కూడా తొలగింపులను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
టెక్ కంపెనీలలో మళ్లీ ఉద్యోగుల తొలగింపులు(Lay Offs) మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫేస్‌బుక్(Meta), ఇన్‌స్టాగ్రామ్(Instagram), వాట్సాప్‌ల(WhatsApp) మాతృ సంస్థ మెటా మరోసారి ఉద్యోగులను తొలగించింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, రియాలిటీ ల్యాబ్‌లతో సహా అనేక విభాగాలలో ఈ తొలగింపు జరిగింది. ది వెర్జ్‌కి చెందిన నివేదికలో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.
మెటా తన దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, వ్యూహాలకు అనుగుణంగా కొన్ని టీమ్‌లలో మార్పులు చేస్తోందని రిపోర్ట్ తెలిపింది. అయితే ఎంత మంది ఉద్యోగులను తొలగించారనే పూర్తి సమాచారం మాత్రం తెలియలేదు. మెటా 2022లో 11,000 మంది ఉద్యోగులను, 2023లో దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించింది.
లాభాలు వచ్చినా
ఈ తొలగింపులు కంపెనీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగమని మెటా ప్రతినిధి డేవ్ ఆర్నాల్డ్ అన్నారు. వనరులను పునర్నిర్మించడం, వాటిని మెరుగ్గా ఉపయోగించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఒక స్థానం తొలగించబడినప్పుడు, వారి స్థానంలో ఇతర ఉద్యోగులకు అవకాశాలు లభించే ఛాన్స్ ఉందని గుర్తు చేశారు. 2024లో ఇప్పటివరకు మెటా షేర్లు 60 శాతం లాభపడ్డాయి. అయినప్పటికీ ఉద్యోగుల తొలగింపు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ తొలగింపు గత ఏడాది కాలంగా కొనసాగుతున్న Meta పునర్నిర్మాణ డ్రైవ్‌లో భాగమని చెబుతున్నారు. ఇంతకుముందు వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఉత్పత్తులపై పనిచేసే మెటా రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో కూడా ఉద్యోగ కోతలు జరిగాయి.
ఉద్యోగి ఏమన్నారంటే..
మెటా వద్ద తొలగింపులను జేన్ మంచున్ వాంగ్ అనే ఉద్యోగి ధృవీకరించారు. వాంగ్ మెటా థ్రెడ్‌ల బృందంలో భాగంగా ఉన్నారు. కొత్త యాప్ ఫీచర్‌లను కనిపెట్టడంలో ప్రసిద్ధి చెందారు. అతను తన తొలగింపు గురించి సమాచారాన్ని బహిరంగంగా పంచుకున్నారు. వాంగ్ 2023లో మెటాలో చేరారు. ఇప్పటివరకు థ్రెడ్స్ ప్లాట్‌ఫారమ్ అభివృద్ధికి సహకరించారు. అదే సమయంలో ఫైనాన్షియల్ టైమ్స్ తన నివేదికలలో ఒకదానిలో మెటా తన లాస్ ఏంజిల్స్ కార్యాలయం నుంచి రెండు డజన్లకుపైగా ఉద్యోగులను తొలగించిందని తెలిపింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదికపై వ్యాఖ్యానించడానికి మెటా నిరాకరించింది.
రాబోయే రోజుల్లో
అంతేకాదు రాబోయే కాలంలో టెక్ పరిశ్రమలో మరిన్ని మార్పులు రావచ్చని టెక్ ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకొన్ని రోజుల్లో పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తాయా అని టెకీలు భయాందోళన చెందుతున్నారు. అనేక టెక్ కంపెనీలు AIపై ఫోకస్ చేసిన నేపథ్యంలో క్రమంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. అయితే మెటా నుంచి తొలగించబడిన పలువురు ఉద్యోగులు సోషల్ మీడియాలో మాట్లాడగా.. బాధిత వ్యక్తుల్లో కొందరికి ఆరు వారాల వేతనం కూడా అందిందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
Firecracker Insurance: ఫైర్‌క్రాకర్స్‌తో గాయపడితే ఇన్సూరెన్స్ పాలసీ.. ఫోన్ పే నుంచి కొత్త స్కీం..
Gold Investment: ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్.. వీటిలో ఏ పెట్టుబడి బెస్ట్
Business Idea: రైల్వేలో ఈ బిజినెస్ చేయండి.. వేల సంపాదనతోపాటు..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News
Updated Date - Oct 17 , 2024 | 04:30 PM