Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ డేటా చోరీకి పాల్పడిందని లీగల్ నోటీసు.. కారణమిదే..
ABN, Publish Date - Jul 29 , 2024 | 06:42 PM
ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) కంపెనీ ఐపీఓకు వస్తున్న వేళ ఈ సంస్థకు షాక్ ఎదురైంది. ఈ వాహనాల్లో మ్యాప్ మై ఇండియా తరహా మ్యాప్‌లను వినియోగిస్తున్నారని ఓలా ఎలక్ట్రిక్‌కు MapmyIndia కంపెనీ లీగల్ నోటీసులు జారీ చేసింది. నోటీసులో ఓలా ఎలక్ట్రిక్ లైసెన్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది.
ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) కంపెనీ ఐపీఓకు వస్తున్న వేళ ఈ సంస్థకు షాక్ ఎదురైంది. ఈ వాహనాల్లో మ్యాప్ మై ఇండియా తరహా మ్యాప్‌లను వినియోగిస్తున్నారని ఓలా ఎలక్ట్రిక్‌కు MapmyIndia కంపెనీ లీగల్ నోటీసులు జారీ చేసింది. నోటీసులో ఓలా ఎలక్ట్రిక్ లైసెన్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. గత కొన్ని రోజులుగా తమ సమాచారాన్ని ఓలా వినియోగిస్తుందని తెలిపింది. Ola MapMyIndia నుంచి డేటాను తీసుకుని మిక్సింగ్ చేసి Ola మ్యాప్స్‌ని రూపొందించారని తెలిపింది. ఆ క్రమంలో రివర్స్ ఇంజనీరింగ్ లైసెన్స్ పొందిన ఉత్పత్తులను కాపీ చేసిందని ఆరోపించింది. MapMyIndia మాతృ సంస్థ CE ఇన్ఫో సిస్టమ్స్. దేశవ్యాప్తంగా ఈ సంస్థ మ్యాప్‌లకు సంబంధించిన సేవలను అందిస్తోంది.
కాపీ చేశారని
OLA మ్యాప్‌లను రూపొందించడానికి మా క్లయింట్ యాజమాన్య మూలం నుంచి API, SDK (సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్)ని కాపీ చేశారని ఆరోపించారు. మా కస్టమర్ ప్రత్యేకమైన డేటా చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం అన్యాయమైన వ్యాపార లాభం కోసం కాపీ చేయబడిందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా తప్పని CE ఇన్ఫో సిస్టమ్స్ తెలిపింది. 2021 ఒప్పందంలోని నిబంధనలను ఓలా ఉల్లంఘించిందని, మేధో సంపత్తి నిబంధనల ప్రకారం కో ఆపరేటెడ్, రివర్స్ ఇంజనీరింగ్‌ను ప్రత్యేకంగా నిషేధించారని లీగల్ నోటీసులో పేర్కొంది. కానీ ఇది జరగలేదని, ఓలా నిరంతరం నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తోందని MapmyIndia చెబుతోంది.
దుర్వినియోగం
జూన్ 2021లో Ola Electric దాని డేటాను ఉపయోగించడానికి CE ఇన్ఫో సిస్టమ్స్‌తో ఒప్పందంపై సంతకం చేసింది. ఇప్పుడు CE ఇన్ఫో సిస్టమ్స్ ఓలాకు లీగల్ నోటీసు పంపింది. ఓలా ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించిందని నోటీసులో పేర్కొంది. Ola CE ఇన్ఫో సిస్టమ్స్ డేటాను దుర్వినియోగం చేసిందని తెలిపింది. ఒప్పందంలో నిషేధించబడిన మార్పులు కూడా తెలిపింది. అంతేకాకుండా ఓలా.. CE ఇన్ఫో సిస్టమ్స్ కాపీరైట్‌ను కూడా ఉల్లంఘించిందని వెల్లడించింది. ఓలా మ్యాప్స్ విడుదలైన ఒక నెల తర్వాత ఈ వివాదం మొదలైంది.
CE ఇన్ఫో సిస్టమ్స్ నోటీసులో Ola తన రహస్య సమాచారాన్ని, వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేసిందని ఆరోపించింది. ఓలా అన్యాయమైన మార్గాలను అవలంబించడం ద్వారా తమ వ్యాపారాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసిందని, తనకు తానుగా లబ్ధి పొందిందని, ఇది ఆమోదయోగ్యం కాదని కంపెనీ పేర్కొంది. అయితే ఈ విషయంపై ఓలా కంపెనీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరికొన్ని రోజుల్లో ఓలా ఐపీఓ రానున్న వేళ ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
Ola IPO: ఓలా ఐపీఓ షేర్ల ధర ఫిక్స్.. పెట్టుబడికి ఎంత కావాలంటే..
Rich Stock: ఏడాదిలోనే ధనవంతులను చేసిన టాటా గ్రూప్ స్టాక్.. ఇంకా పెరగనుందా?
Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే
Bank Holidays: ఆగస్టులో దాదాపు సగం రోజులు బ్యాంకులు బంద్.. కారణాలివే
Read More Business News and Latest Telugu News
Updated Date - Jul 29 , 2024 | 06:44 PM