Stock Markets: 770 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మిడ్ క్యాప్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ABN, Publish Date - Mar 15 , 2024 | 01:07 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో (మార్చి 15న) భారీ నష్టా్లతో కొనసాగుతున్నాయి. మార్కెట్‌లోని ప్రధాన సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అయితే మార్కెట్ల భారీ నష్టాలకు గల కారణాలు ఏంటి, ఏ స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వారాంతంలో (మార్చి 15న) భారీ నష్టా్లతో(losses) కొనసాగుతున్నాయి. మార్కెట్‌లోని ప్రధాన సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బలహీనమైన గ్లోబల్ సిగ్నల్స్‌తో పాటు మ్యూచువల్ ఫండ్స్ ఒత్తిడి కూడా మార్కెట్‌ను ప్రభావితం చేసింది. దీంతో ఆసియా స్టాక్ మార్కెట్ సూచీలు కూడా దిగువకు పయనిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్(federal reserve bank) మళ్లీ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు సహా పలు అంశాలు మార్కెట్‌పై ప్రభావితం చూపినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మధ్యాహ్నం 12.50 నిమిషాలకు సెన్సెక్స్ 546 పాయింట్లు కోల్పోయి 72546 వద్ద ఉండగా, నిఫ్టీ 180 పాయింట్లు కోల్పోయి 22900 దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా వరుసగా 376, 670 పాయింట్లు నష్టపోయింది.
ఈ క్రమంలో ప్రస్తుతం BPCL, ONGC, కోల్ ఇండియా, NTPC, హీరో మోటోకార్పొరేషన్ సంస్థల స్టాక్స్ టాప్ 5లో ఉండగా, UPL, ITC, భారతి ఎయిర్‌టెల్, HDFC లైఫ్, బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. అయితే ప్రధానంగా ఐటీ, ఫార్మా, ఆటో, బ్యాంకింగ్ రంగాల్లో మార్కెట్‌లో అత్యధికంగా అమ్మకాలు జరుగుతున్నాయి. మీడియా, ప్రభుత్వ బ్యాంకింగ్, మెటల్, రియల్టీ రంగాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి.
అంతకుముందు గురువారం సెన్సెక్స్ 335 పాయింట్లు ఎగబాకి 73,097 వద్ద ముగిసింది. ఏది ఏమైనప్పటికీ చిప్ సెక్టార్ షేర్లలో భారీ అమ్మకాల ప్రభావం ఆసియా మార్కెట్లలో చూపించిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Electoral Bond Donations: ఎలక్టోరల్ బాండ్ల విరాళంలో ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ రూ.1,368 కోట్లతో టాప్.. అసలేంటీ దీని కథ
Updated Date - Mar 15 , 2024 | 01:07 PM