ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Costliest City: దేశంలో అత్యంత ఖరీదైన నగరం ఇదే.. ప్రపంచంలో ఇస్లామాబాద్ మాత్రం..

ABN, Publish Date - Jul 04 , 2024 | 01:34 PM

భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో(costliest city) ముంబయి(Mumbai) మొదటి స్థానం దక్కించుకుంది. అవును మీరు విన్నది నిజమే. మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్ 2024 వివరాలను వెల్లడించింది. ఆ క్రమంలో ఢిల్లీ ప్రపంచంలో 165వ స్థానంలో ఉందని రిపోర్ట్ తెలిపింది. ఈ జాబితాలో మిగతా నగరాలు ఎన్నో ర్యాంకు దక్కించుకున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Mercers Cost of Living City ranking

భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో(costliest city) ముంబయి(Mumbai) మొదటి స్థానం దక్కించుకుంది. అవును మీరు విన్నది నిజమే. మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్ 2024 ఈ వివరాలను వెల్లడించింది. ఈ క్రమంలో ప్రవాసులకు ముంబయి అత్యంత ఖరీదైన నగరమని, ఢిల్లీ ప్రపంచంలో 165వ స్థానంలో ఉందని రిపోర్ట్ తెలిపింది. మరోవైపు చెన్నై ఐదు పాయింట్లు జారిపోగా, బెంగళూరు ఆరు పాయింట్లు జారి వరుసగా 189, 195కి పడిపోయాయి. ఈ జాబితాలో హైదరాబాద్(hyderabad) 202కు చేరుకుంది. ప్రవాసుల కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో పూణే 205, కోల్‌కతా 207వ స్థానంలో ఉన్నాయి.


మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్ 2024(Mercers Cost of Living City ranking 2024) జాబితా గ్లోబల్ మొబిలిటీపై సమాచారాన్ని అందించిన క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 226 నగరాలను విశ్లేషించింది. వసతి, రవాణా, ఆహారం, దుస్తులు, వినోదం వంటి 200 కంటే వస్తువుల ధరల ఆధారంగా జాబితాను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం ప్రవాసుల కోసం ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో హాంకాంగ్(Hong Kong), సింగపూర్, జ్యూరిచ్ టాప్ 3లో ఉన్నాయి. ఇక ఇస్లామాబాద్, లాగోస్, అబుజా చివరి స్థానాల్లో నిలిచాయి.


సర్వే ప్రకారం ద్రవ్యోల్బణం, మారకపు రేటు వ్యత్యాసాలు, ఆర్థిక, భౌగోళిక రాజకీయ అస్థిరత, పెరుగుతున్న సంఘర్షణలు వంటి అనేక అంశాలు జీవన వ్యయం పెరుగుదలకు దోహదపడ్డాయని నివేదిక తెలిపింది. హాంకాంగ్ వంటి నగరాల్లో ఖరీదైన గృహాలు, అధిక రవాణా ఖర్చులు, ఖరీదైన వస్తువులు సేవల కారణంగా జీవన వ్యయం ఎక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. కరెన్సీ విలువ తగ్గింపు కారణంగా ఇస్లామాబాద్(Islamabad), లాగోస్, అబుజాలో జీవన వ్యయం తగ్గిందని రిపోర్ట్ స్పష్టం చేసింది.


ఇది కూడా చదవండి:

Swiggy: 2030నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరనున్న ఫుడ్ మార్కెట్

Gold and Silver Rate: పెరిగిన గోల్డ్ ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి

For Latest News and Business News click here

Updated Date - Jul 04 , 2024 | 01:36 PM

Advertising
Advertising