Share News

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

ABN , Publish Date - Oct 02 , 2024 | 07:53 PM

మీరు తక్కువ మొత్తం పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే Mirae అసెట్ మ్యూచువల్ ఫండ్ తాజాగా రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేసుకోవచ్చని ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చుద్దాం.

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
rs 99 sip details

స్టాక్ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడులు(Investments) పెట్టే బదులు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా స్టాక్ మార్కెట్‌లోని బూమ్‌ను మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. దీని కోసం సిప్(SIP) విధానంలో పెట్టుబడులు చేయడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీనిలో మీరు తక్కువ మొత్తం నుంచి కూడా పెట్టుబడులను ప్రారంభించవచ్చు. ఈ క్రమంలో ప్రతి నెల కేవలం 99 రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. LIC మ్యూచువల్ ఫండ్ ఇటీవల రూ. 100 నుంచి SIPని ప్రారంభించే ఆప్షన్‌ని ప్రకటించింది. ఈ క్రమంలోనే మిరాయ్ అసెట్ మ్యూచువల్ ఫండ్ దీనిని రూ. 99 నుంచి అక్టోబర్ 1, 2024న ప్రారంభించింది. ఇది నెలవారీ, త్రైమాసిక SIP ఫ్రీక్వెన్సీకి వర్తిస్తుంది.


ట్యాక్స్ సేవర్ ఫండ్‌లో

మిరాయ్ అసెట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు ఇప్పటివరకు రూ. 500 కంటే తక్కువ ధరకే SIPని ప్రారంభించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు దానిని రూ.99కి తగ్గించారు. అయితే ఈ మార్పు మిరాయ్ అసెట్ ELSS టాక్స్ సేవర్ ఫండ్ విధానంలో వర్తించదు. దీని కింద SIPని రూ. 500 నుంచి మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఇందులో రూ.500 లేదా రూ.500 గుణిజాల్లో SIPను ఎంపిక చేసుకోవచ్చు.


లాక్ ఇన్ పీరియడ్ ఉందా?

Mirae Asset ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్ మినహా SIPలు ఎటువంటి తప్పనిసరి లాక్ ఇన్ పీరియడ్‌లు లేకుండా ఫ్లెక్సిబిలిటీని అందిస్తాయి. మీ పెట్టుబడులపై మీకు నియంత్రణను అందిస్తాయి.

SIP మొత్తాన్ని తర్వాత పెంచుకోవచ్చా?

మీరు మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మీ SIP మొత్తాన్ని ఎప్పుడైనా పెంచుకోవచ్చు


ఎల్‌ఐసీ ఇప్పటికే

మరోవైపు ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ గత వారం కేవలం 100 రూపాయలకే రోజువారీ SIPని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు SIP కనీసం రూ. 300 ప్రారంభం అయ్యేది. నెలవారీ SIP గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు దీన్ని రూ. 1000కి బదులుగా రూ. 250 నుంచి ప్రారంభించుకోవచ్చు. త్రైమాసిక ప్రాతిపదికన మీరు దీన్ని రూ. 3000కి బదులుగా రూ. 750 నుంచి మొదలుపెట్టవచ్చు.

దీర్ఘకాలంలో

దీంతో తక్కువ ఆదాయ పెట్టుబడిదారులు, కొత్తగా ఉద్యోగాలు ప్రారంభించే వ్యక్తులు, గృహిణులు, చిన్న దుకాణ యజమానులు సహా పలువురు ప్రతిరోజూ డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందవచ్చు. ఇది పెట్టుబడిదారులకు మాత్రమే కాకుండా ఫండ్ హౌస్‌కు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది, దీని పరిధి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు దీని పరిధిలోకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Cash Deposit Machine: క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా రోజు ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు..


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం.

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..


Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 02 , 2024 | 08:00 PM