Stock Market: వెయ్యి పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మిడ్‌క్యాప్.. 6 లక్షల కోట్లు కోల్పోయిన మదుపర్లు
ABN, Publish Date - Nov 13 , 2024 | 02:36 PM
దేశీయ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా ఐదవ రోజు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 688.17 పాయింట్లు పతనమై 77,987.01 వద్ద, నిఫ్టీ 235.65 పాయింట్లు కోల్పోయి 23,647.80 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు (stock markets) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న బలహీనమైన ధోరణుల నేపథ్యంలో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 511.06 పాయింట్లు క్షీణించి 78,164.12 వద్ద, నిఫ్టీ 186 పాయింట్లు తగ్గిపోయి 23,696 స్థాయిలో ట్రేడయ్యాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 453 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 1030 పాయింట్లు తగ్గింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 16 షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. మరోవైపు నిఫ్టీ 50లో 50 షేర్లలో 31 షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. దీంతో మదుపర్లు కొన్ని గంటల్లోనే 6 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు.
నష్టాల్లో ఉన్న వాటిలో
మహీంద్రా అండ్ మహీంద్రా (2.48 శాతం క్షీణత), మారుతీ సుజుకీ ఇండియా, టాటా స్టీల్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా నష్టాలలో ముందుండగా, లాభాల్లో ఉన్న వాటిలో ఎన్‌టీపీసీ (1.28 శాతం), ఏషియన్ పెయింట్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. ఇక సెక్టార్ల వారీగా చూస్తే హెల్త్‌కేర్, ఫార్మా, ఆటో సూచీలు 0.75, 0.85 శాతం మధ్య పడిపోగా, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటి సూచీలు మాత్రమే లాభపడ్డాయి. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.38 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 0.66 శాతం క్షీణించాయి.
నష్టాలకు కారణమిదేనా..
అక్టోబరులో 6.2%గా నమోదైన దేశీయ ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటం ఈ బేరిష్ సెంటిమెంట్‌కు కారణమని చెప్పవచ్చు. ఇది RBI ప్రాధాన్యత పరిధి కంటే ఎక్కువగా ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కనిపించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 3,000 కోట్లకు పైగా విలువైన ఈక్విటీలను ఆఫ్‌లోడ్ చేశారు. ఇక US ద్రవ్యోల్బణం డేటా కంటే ముందు ట్రేడింగ్ జాగ్రత్తగా ఉండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $72.09 వద్ద ట్రేడవుతోంది.
గత సెషన్ ఎలా ఉందంటే..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత మంగళవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో వాల్ స్ట్రీట్‌లో నష్టాలు కనిపించాయి. మంగళవారం బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 దాదాపు ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎందుకంటే విదేశీ ఫండ్స్‌లో స్థిరమైన అమ్మకాలు, ఇండెక్స్ హెవీవెయిట్‌లలో తీవ్రమైన నష్టాలు మార్కెట్ పనితీరుపై ప్రభావం చూపాయి. USలో ఆదాయ అంచనాలు, పెట్టుబడి అవకాశాలు కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను అణచివేశాయి.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Life Certificate 2024: మీ పెన్షన్ ఆగకుడదంటే ఇలా చేయండి.. కొన్ని రోజులే గడువు..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More International News and Latest Telugu News
Updated Date - Nov 13 , 2024 | 06:48 PM