Share News

Union Budget 2024: తెలుపు, ఊదా రంగు చీరకట్టులో నిర్మలమ్మ

ABN , Publish Date - Jul 23 , 2024 | 10:46 AM

కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజున ఆర్థిక మంత్రులు ధరించే దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అనాది కాలంగా ఈ ప్రాధాన్యత కొనసాగుతోంది.

Union Budget 2024: తెలుపు, ఊదా రంగు చీరకట్టులో నిర్మలమ్మ
Nirmala Sitaraman

కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజున ఆర్థిక మంత్రులు ధరించే దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అనాది కాలంగా ఈ ప్రాధాన్యత కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరిస్తున్న సాంప్రదాయక చీరకట్టు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈసారి ఆమె బడ్జెట్ కోసం ఆమె తెలుపు, ఊదారంగు చీరకట్టులో సిద్ధమయ్యారు. భారతీయ దుస్తులను ఇష్టపడతారని పేరు ఉన్న ఆమె ఈ చీర కట్టులో మెరిపించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 2024లో మధ్యంతర బడ్జెట్ సందర్భంగా బ్లూ-క్రీమ్ కలర్‌ రంగు సిల్క్ చీరను ధరించారు. సీతారామన్ ఇప్పటివరకు ఆరుసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నేటి బడ్జెట్‌తో వరుసగా ఏడు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఏయే రంగు చీరలు ధరించారో ఓ లుక్కేద్దాం..


2023లో ఎరుపు పట్టు..

2023 కేంద్ర బడ్జెట్ సమయంలో సీతారామన్ సాంప్రదాయక ఆలయం బార్డర్ ఉన్న ఎరుపు రంగు చీరను ధరించారు. ఈ చీర కర్నాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో తయారు చేశారు.


2022లో బ్రౌన్ రంగు శారీ

2022 కేంద్ర బడ్జెట్ సమయంలో సీతారామన్ ఒడిశా చేనేత వర్గాన్ని గౌరవస్తూ బ్రౌన్ రంగు శారీని ధరించారు. ఈ చీరలను ఒడిశాలో తయారు చేస్తుంటారు.


2021లో పోచంపల్లి పట్టు

సీతారామన్ ఎరుపు రంగు అంచులతో కూడిన తెలుపు రంగు పోచంపల్లి పట్టును ధరించారు. చీర అంచున ఇకత్ డిజైన్‌ ఉంది. పోచంపల్లి ఇకత్ తెలంగాణాలో తయారవుతుంది. భారతదేశ వ్యాప్తంగా పట్టు నగరంగా గుర్తింపు తెచ్చుకున్న భూదాన్‌లో ఈ చీర తయారైంది.


2020లో పసుపు-బంగారు పట్టు

ఆర్థిక మంత్రి సీతారామన్ 2020 బడ్జెట్ సమయంలో పసుపు రంగు పట్టు చీరను ధరించారు. మ్యాచింగ్ బ్లౌజ్‌తో కూడా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మన దేశంలో పసుపును శుభప్రదంగా పరిగణిస్తారు. అంతేకాదు శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. ఈ చీరను ధరించి భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు గౌరవం ఇచ్చినట్టయింది.


2019లో గులాబీ రంగు మంగళగిరి చీర

2019లో మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సీతారామన్ గులాబీ రంగు మంగళగిరి సిల్క్ చీరను ధరించారు. ఈ చీరకు బంగారు వర్ణం అంచు ఉంది.

Updated Date - Jul 23 , 2024 | 10:49 AM