ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. పెరగనున్న EVల ధరలు?

ABN, Publish Date - Sep 05 , 2024 | 06:25 PM

దేశంలో త్వరలో ఈవీల(electric vehicles) రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తాజాగా దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలకు ఇకపై ప్రభుత్వ రాయితీలు అవసరం లేదని భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎందుకు ఇలా అన్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Nitin Gadkari

మీరు ఎలక్ట్రిక్ వాహనం(electric vehicles) తీసుకోవాలని చూస్తున్నారా. అయితే వెంటనే కొనుగోలు చేయండి. ఎందుకంటే దేశంలో త్వరలో ఈవీల రేట్లు పెరిగే అవకాశం ఉంది. దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలకు ఇకపై ప్రభుత్వ రాయితీలు అవసరం లేదని తాజాగా భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) తెలిపారు. వీటికి డిమాండ్ పెరగడం, ఉత్పత్తి ఖర్చులు తగ్గడం వల్ల ఇకపై సబ్సిడీ అవసరం లేదన్నారు. ఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ NEF సమ్మిట్‌లో గడ్కరీ ఈ మేరకు పేర్కొన్నారు.


ఖర్చులు తగ్గాయి

ప్రారంభ వ్యయం ఎక్కువగా ఉందని, అయితే డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి ఖర్చులు(expenses) తగ్గాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికే అనుకూలమైన పన్నును అనుభవిస్తున్నాయని, EVలపై GST కేవలం 5% మాత్రమే ఉందన్నారు. ఇది పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే చాలా ఎక్కువ ప్రయోజనాన్ని అందజేస్తుందని గడ్కరీ వెల్లడించారు. ఈ క్రమంలో సబ్సిడీ డిమాండ్ ఇకపై సమర్థించబడదని కేంద్ర మంత్రి భావించారు. ఈ నేపథ్యంలో క్లీన్ ఎనర్జీ వైపు విస్తృతంగా మారాలని గడ్కరీ సూచించారు.


పన్నులు

కానీ దేశంలో ఇంకా పెట్రోలు, డీజిల్‌పై భారతదేశం ఆధారపడటం ఒక ఆందోళనకర విషయమని గడ్కనీ అన్నారు. కానీ పెట్రోల్, డీజిల్ వాహనాలపై అదనపు పన్నులు విధించే అంశాన్ని ఆయన తిరస్కరించారు. ప్రజా రవాణాలో EVల విస్తరణ గురించి ప్రస్తావించారు. పెట్రోల్ డీజిల్ వాహనాలపై ఆధారపడటం వల్ల కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని, ఇలాంటి క్రమంలో ఎలక్ట్రిక్ బస్సులు కీలక పాత్ర పోషిస్తాయని నితిన్ గడ్కరీ అన్నారు.


త్వరలో పెరగనున్న రేట్లు

అయితే ప్రభుత్వం EV కంపెనీలకు ఇచ్చే సబ్సిడీ కారణంగా కొనుగోలుదారులు కొంత ప్రయోజనం పొందుతున్నారు. ఇకపై త్వరలో సబ్సిడీ ముగిస్తే ఆ భారాన్ని కంపెనీలు వినియోగదారులపై మోపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాహనం కొనుగోలు చేసే సమయంలో ప్రభుత్వం EV వినియోగదారులకు తగ్గింపులను అందిస్తుంది. కంపెనీలు డిస్కౌంట్లను పొందడం ఆపివేస్తే, కస్టమర్లకు కూడా ఈ డిస్కౌంట్లను కంపెనీలు నిలిపివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై 40 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అదేవిధంగా త్రీవీలర్లు, నాలుగు చక్రాల వాహనాలపై కిలోవాట్‌కు రూ.10,000 వరకు రాయితీ ఇస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న తాత్కాలిక ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) FAME 3 సెప్టెంబర్‌ 2024లో ముగుస్తుంది.


ఇవి కూడా చదవండి:

Onions: ఇక్కడ రూ. 35కే కిలో ఉల్లి.. ఎక్కడో తెలుసా..


BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కట్టడికి బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్లాన్.. టాటా సపోర్ట్‌తో ఇక..


Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..


Read More Business News and Latest Telugu News

Updated Date - Sep 05 , 2024 | 06:27 PM

Advertising
Advertising