ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Married Womens: ఈ కంపెనీలో పెళ్లైన మహిళలకు నో జాబ్స్.. తీవ్రంగా స్పందించిన కేంద్రం

ABN, Publish Date - Jun 27 , 2024 | 10:34 AM

ఐఫోన్ల(iPhones) తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్(Foxconn plant) పెళ్లైన మహిళలకు(married womens) ఉద్యోగాలు(jobs) ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి నివేదిక కోరింది.

No jobs report for married women

ఐఫోన్ల(iPhones) తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్(Foxconn plant) పెళ్లైన మహిళలకు(married womens) ఉద్యోగాలు(jobs) ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి నివేదిక కోరింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం iPhone తయారీదారైన Foxconn కంపెనీలో వివాహిత మహిళల ఉద్యోగ దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. ఈ అంశం చెన్నై ప్లాంట్‌లో వెలుగులోకి వచ్చింది.

చెన్నై(Chennai) సమీపంలోని ఐఫోన్ ప్లాంట్‌లో వివాహిత మహిళలను ఉద్యోగాలకు దూరంగా ఉంచినట్లు స్వయంగా ఫాక్స్‌కాన్ సమాచారం అందించడం చర్చనీయాంశంగా మారింది. అవివాహిత మహిళల కంటే వివాహిత మహిళలకు(married womens) ఎక్కువ కుటుంబ బాధ్యతలు ఉంటాయని కంపెనీ విశ్వసిస్తోందని పలు వర్గాలు అంటున్నాయి. అందుకే కంపెనీ వారికి ఉద్యోగాలివ్వడం లేదని చెబుతున్నారు.


ఈ సమాచారం తెలుసుకున్న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ(Labour Ministry) తీవ్రంగా స్పందించింది. సమాన వేతన చట్టం 1976లోని సెక్షన్ 5 ప్రకారం స్త్రీ, పురుష కార్మికులను రిక్రూట్‌ చేసుకునే సమయంలో ఎలాంటి వివక్ష ఉండరాదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తమిళనాడు రాష్ట్రాన్ని వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని యాపిల్ ప్లాంట్ ఫాక్స్‌కాన్‌లో వివాహిత మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఇటివల మీడియాతోపాటు సోషల్ మీడియా(social media)లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇది తెలిసిన నెటిజన్లు ప్రముఖ కంపెనీలో ఇలా పెళ్లైన మహిళల విషయంలో వివక్ష చూపించడం సరికాదని అంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ విషయంపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.


ఇది కూడా చదవండి:

T20 World Cup 2024: నేడు ఇండియా, ఇంగ్లండ్ మధ్య కీలక మ్యాచ్.. గెలుపెవరిది?

డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి నికోటినెల్‌ బ్రాండ్‌

ఆగని రికార్డుల హోరు


For Latest News and Business News click here

Updated Date - Jun 27 , 2024 | 11:26 AM

Advertising
Advertising