ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: వారాంతంలో సెన్సెక్స్ జోరు.. రికార్డు స్థాయిలో ముగిసిన సూచీలు

ABN, Publish Date - Aug 30 , 2024 | 04:02 PM

స్టాక్ మార్కెట్లో సెప్టెంబర్ సిరీస్‌కు మంచి ఆరంభం లభించింది. మార్కెట్లు వరుసగా 12వ రోజు గ్రీన్‌లో ముగిశాయి. నేడు (ఆగస్టు 30న) మళ్లీ కొత్త ముగింపు గరిష్టాలను కూడా తాకాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్-నిఫ్టీలు అర శాతం లాభాలతో ముగిశాయి.

Stock Market on august 30th 2024

దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) వారాంతంలో(ఆగస్టు 30న) కూడా బలమైన బుల్లిష్ ట్రెండ్ కొనసాగింది. ఈ క్రమంలో సెప్టెంబర్ సిరీస్‌కు మంచి ఆరంభం లభించింది. మార్కెట్లు వరుసగా 12వ రోజు గ్రీన్‌లో ముగిశాయి. నేడు మళ్లీ కొత్త ముగింపు గరిష్టాలను కూడా తాకాయి. సెన్సెక్స్-నిఫ్టీలు అర శాతం లాభాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 231.16 పాయింట్లు లేదా 0.28 శాతం లాభంతో 82,365.77 వద్ద ముగిసింది. నిఫ్టీ 83.96 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 25,235.90 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 198 పాయింట్లు పెరిగి 51,351 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్ 403 పాయింట్లు ఎగబాకి 59,287కు చేరుకుంది.


రికార్డు స్థాయికి

ఈ క్రమంలోనే నిఫ్టీ ఈరోజు 25,263 వద్ద రికార్డు స్థాయిని తాకింది. మరోవైపు సెన్సెక్స్ కూడా 82,637 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 23 షేర్లు పెరుగగా, నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 38 లాభాల్లోనే కొనసాగాయి. నిఫ్టీ బ్యాంక్‌లోని 12 షేర్లలో 9 షేర్లు లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలోనే నేటి మార్కెట్లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో మంచి కొనుగోళ్లు జరిగాయి. ఫార్మా, రియాల్టీ, పీఎస్‌ఈ షేర్లు, ఆయిల్ గ్యాస్, నిఫ్టీ బ్యాంక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ షేర్లలో ఒత్తిడి కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న అనుకూల ధోరణుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా పాజిటివ్ ధోరణిలో కొనసాగినట్లు తెలుస్తోంది.


పుంజుకున్న పేటీఎం

నేడు One 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (Paytm) షేర్లు 13 శాతం పెరిగి రూ.600 మార్కును అధిగమించాయి. ఈ క్రమంలో బీఎస్‌ఈలో 12.5 శాతం పెరిగి గరిష్టంగా రూ.623.80ని తాకింది. అమ్మకపు ఆర్డర్‌లకు వ్యతిరేకంగా 51,32,143 షేర్లకు కొనుగోలు ఆర్డర్లు వచ్చాయి. ఫిన్‌టెక్ మేజర్‌కి ఇది రెండో రోజు ర్యాలీ కావడం విశేషం. ADANI పోర్ట్స్ అనుబంధ సంస్థ APSEZ ఆస్ట్రో ఆఫ్‌షోర్ గ్రూప్‌లో 80% వాటాను కొనుగోలు చేసింది. ASTRO OFFSHORE ఒక గ్లోబల్ OSV ఆపరేటర్. ADANI PORTS అనుబంధ సంస్థ APSEZ ఆస్ట్రో ఆఫ్‌షోర్ గ్రూప్‌లో ఈ వాటాను $18.5 కోట్లకు కొనుగోలు చేసింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సఫల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.


ఒప్పందాలు

ఆరావళి ఇంజిన్‌ను అభివృద్ధి చేసేందుకు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త తరం హెలికాప్టర్ ఇంజిన్‌లను సిద్ధం చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది. మ్యాక్స్ ఎస్టేట్స్ తన క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP)ని ప్రారంభించింది. ఇది ఆగస్టు 29న తెరవబడింది. ఇందుకోసం ఒక్కో ఈక్విటీ షేర్‌పై ఫ్లోర్‌ ధరను రూ.628.74గా ఉంచారు. ఆగస్టు 30న కంపెనీ షేర్లలో తొలి విక్రయం జరిగింది. తర్వాత మళ్లీ గ్రీన్‌మార్క్‌లోకి వచ్చింది. ఉదయం రూ.666 వద్ద ప్రారంభమైన ఈ షేరు ఆపై రూ.658 కనిష్ట స్థాయికి దిగజారింది. రోజులో స్టాక్ దాదాపు 2 శాతం జంప్ చేసి రూ.694.80 గరిష్ట స్థాయికి చేరుకుంది.


ఇవి కూడా చదవండి:

Vistara: ప్రయాణికులకు అలర్ట్.. ఈ విమాన టిక్కెట్స్ బుకింగ్ బంద్

Narendra Modi: గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. కరెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు


Personal Loan: పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారా.. ఈ ఛార్జీల విషయంలో జాగ్రత్త

Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 04:38 PM

Advertising
Advertising