ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

ABN, Publish Date - May 20 , 2024 | 03:50 PM

చాలా మంది వాహనదారులకు ఇంధన వాడకం విషయంలో పలు రకాల సందేహాలు ఉంటాయి. బైక్(bike) లేదా కారు(car)లో ఫుల్ ట్యాంక్ ఇంధనం(fuel) నింపుకుంటే మంచి మైలేజీ వస్తుందా లేదా లీటర్ నింపుకోవాలా అనే సందేహం ఉంటుంది. అయితే అసలు విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Mileage Tips petrol and diesel

చాలా మంది వాహనదారులకు ఇంధన వాడకం విషయంలో పలు రకాల సందేహాలు ఉంటాయి. బైక్(bike) లేదా కారు(car)లో ఫుల్ ట్యాంక్ ఇంధనం(fuel) నింపుకుంటే మంచి మైలేజీ వస్తుందా లేదా లీటర్ నింపుకోవాలా అనే సందేహం ఉంటుంది. అయితే కొంతమంది వాహనం ట్యాంక్‌ను నింపడం వల్ల మైలేజీ పెరుగుతుందని చెబుతుండగా, అలాంటిదేమి లేదని మరికొందరు అంటున్నారు. అయితే అసలు విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


అయితే మీ కారు లేదా బైక్‌ను ఫుల్ ట్యాంక్ చేయిస్తే అది మైలేజీపై ప్రభావం చూపదని ఆటోమొబైల్ నిపుణులు స్పష్టం చేశారు. ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల కారు లేదా బైక్ మైలేజీ పెరగదని వెల్లడించారు. బైక్ లేదా కారు మైలేజీ మీరు డ్రైవింగ్(driving) చేసే విధానంపై ఆధారపడి ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు తెలిపారు. మీరు డ్రైవింగ్ చేసే సమయంలో పదేపదే బ్రేక్‌లు వేయడం లేదా క్లచ్‌ని నిరంతరం నొక్కితే మైలేజ్ తగ్గవచ్చని చెప్పారు. ఇది కాకుండా స్పీడులో తరచుగా మార్పులు చేయడం వల్ల కూడా మైలేజీ తగ్గుతుందన్నారు. మీరు మంచి మైలేజీని పొందాలనుకుంటే వాహనాన్ని ఎకానమీ మోడ్‌లో నడపాలని సూచించారు.


దీంతోపాటు మీరు వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీస్(servicing) చేయించి, ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్‌ను మార్చడం వల్ల కూడా వాహనం మంచి కండీషన్‌లో ఉండి మంచి మైలేజ్ ఇస్తుందన్నారు. దీంతోపాటు టైర్ ప్రెజర్‌ను కూడా రోజు చెక్ చేసుకోవాలని, టైర్‌లో గాలి సరైన స్థాయిలో ఉంటే వాహనం సరిగ్గా ప్రయాణిస్తుందన్నారు. అయితే హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణించినప్పుడు ఎక్కువ మైలేజీని పొందుతారు. కానీ అదే సమయంలో సిటీలో ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో డ్రైవ్‌లో చేసినప్పుడు మైలేజీ తగ్గుతుందని నిపుణులు వెల్లడించారు.


ఇది కూడా చదవండి:

Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

Read Latest Business News and Telugu News

Updated Date - May 20 , 2024 | 03:54 PM

Advertising
Advertising