ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Post Office Shcemes: అదిరిపోయే స్కీమ్.. రూ. 5 లక్షలు కడితే రూ. 2.24 లక్షల వడ్డీ..

ABN, Publish Date - May 30 , 2024 | 05:25 PM

Personal Finance: స్థిర ఆదాయాన్ని అందించే పథకాలలో ‘ఫిక్స్‌డ్ డిపాజిట్లు’(Fixed Deposit) అగ్రస్థానంలో ఉన్నాయి. మార్కెట్ పెట్టుబడిదారులకు(Investments) నష్ట భయం లేకుండా హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. వివిధ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ముఖ్యంగా పోస్టాఫీసులు(Post Office Fixed Deposit Schemes) ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అందిస్తున్నాయి.

Post Office Fixed Time Deposit

Personal Finance: స్థిర ఆదాయాన్ని అందించే పథకాలలో ‘ఫిక్స్‌డ్ డిపాజిట్లు’(Fixed Deposit) అగ్రస్థానంలో ఉన్నాయి. మార్కెట్ పెట్టుబడిదారులకు(Investments) నష్ట భయం లేకుండా హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. వివిధ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, ముఖ్యంగా పోస్టాఫీసులు(Post Office Fixed Deposit Schemes) ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అందిస్తున్నాయి. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు(FD) భవిష్యత్ అవసరాల కోసం డబ్బును ఆదా చేయాలనుకునే సీనియర్ సిటిజన్‌లకు మంచి ఆదాయ వనరు.

అయితే, పోస్టల్ డిపార్ట్‌మెంట్ తమ కస్టమర్ల కోసం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ‘పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్’(TD) పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరే వారు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ తరువాత రూ. 2.24 లక్షల వడ్డీని పొందవచ్చు. ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..


ఇవీ స్కీమ్ వివరాలు..

పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఈ స్కీమ్‌లో ఎవరైనా చేరొచ్చు. వయోపరిమితి ఏమీ లేదు. పోస్టాఫీస్ 4 రకాల ఎఫ్‌డీ స్కీమ్‌లను అందిస్తోంది. 1, 2, 3, 5 సంవత్సరాల కాలపరిమితితో ఈ ఎఫ్‌డీని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ముగ్గురు వ్యక్తులు మించకుండా ఒకే ఖాతా, ఉమ్మడి ఖాతాను కూడా ఓపెన్ చేయొచ్చు. మైనర్‌ల విషయానికి వస్తే.. వారి తరఫున సంరక్షకులు అకౌంట్‌ను తెరవచ్చు.ఈ పథకం కింద కనీసం రూ. 1000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఐదేళ్ల ఎఫ్‌డీ కోసం ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు.


మరో అవకాశం కూడా...

పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితిని పొడిగించడానికి పాలసీదారులకు ఒక అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఐదేళ్ల పాలసీని మరో 18 నెలలు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ స్కీమ్‌లో భాగంగా అకౌంట్ తెరవడానికి ముందు.. మెచ్యూరిటీ పూర్తయిన తరువాత ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి అవకాశం ఉంది.


ఎఫ్‌డీ ముందే క్లోజ్ చేయొచ్చా?

అత్యవసరం అయితే మెచ్యూరిటీకి ముందే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను క్లోజ్ చేయొచ్చు. అయితే, ప్రీ-క్లోజర్ విషయంలో వడ్డీ రేట్లు మారుతాయి. పాలసీలో చేరిన ఒక సంవత్సరం తరువాత ప్రీ-క్లోజ్ చేస్తే 1, 2, 3 సంవత్సరాలకు అందించే వడ్డీ రేటు కంటే 2 శాతం తక్కువగా వడ్డీ రేటు వర్తిస్తుంది. ఎఫ్‌డీని ఒక సంవత్సరం లోపే మూసివేస్తే పోస్ట్ ఆఫీస్ అందించే సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లే వర్తిస్తాయి.


పన్ను మినహాయింపు.. వడ్డీ రేట్లు..

పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కాగా, పైన పేర్కొన్న నాలుగు రకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లు భిన్నంగా ఉంటాయి. ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పాలసీకి సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. వడ్డీ ప్రతి 3 నెలలకు లెక్కిస్తారు. ఖాతాదారుని సేవింగ్స్ అకౌంట్‌లో వార్షిక వడ్డీ జమ చేయబడుతుంది.


ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది..

ఈ పథకాల్లో భాగంగా ఐదేళ్ల కాలానికి రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత రూ.2,24,974 వడ్డీని పొందవచ్చు. అంటే మొత్తం రూ.7,24,974 ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ మీరు రూ. 7 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ రూ. 3,37,461 వస్తుంది. ఐదేళ్ల కాలానికి రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ తర్వాత రూ.4,49,948 వడ్డీతో కలిపి రూ.14,49,948 వస్తుంది.

For More Business News and Telugu News..

Updated Date - May 30 , 2024 | 05:26 PM

Advertising
Advertising