ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ratan Tata: ఈ ఒక్క కారణంతో.. రతన్ టాటా విదేశాల నుంచి భారత్ వచ్చేశారు..

ABN, Publish Date - Oct 10 , 2024 | 07:31 AM

రతన్ టాటా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే రతన్ టాటా మృతి సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించి అనేక కథలు చాలానే ఉన్నాయి. కానీ విదేశాల్లో స్థిరపడాలని అనుకున్న క్రమంలో భారత్ ఎందుకు వచ్చారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఎంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

Ratan Tata

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా(Ratan Tata) ఇక మన మధ్య లేరు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కానీ ఆయన మాత్రం మన హృదయాల్లో ఎప్పుటికీ నిలిచి ఉంటారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలవడంతోపాటు ఆయన మంచి స్వభావం గల వ్యక్తిగా కూడా పేరు సంపాదించారు. టాటాకు మనుషులంటేనే కాదు, జంతువుల పట్ల కూడా అపారమైన ప్రేమ ఉండేది. ఈ విషాద ఘటన సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన ఓ కీలక విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుందాం.


చదువుల కోసం

1937 డిసెంబరు 28న నావల్, సును టాటా దంపతులకు ముంబైలో జన్మించిన తర్వాత ఆయనకు రతన్ నావల్ టాటా అని పేరు పెట్టారు. ఇక పై చదువుల కోసం అమెరికా వెళ్లిన రతన్ టాటా అక్కడే కార్నెల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు. ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. ఆ క్రమంలో 1955 నుంచి 1962 వరకు అమెరికాలోనే ఉన్నారు. ఈ చదువులు, అక్కడి వాతావరణం ఆయన జీవితంపై చాలా ప్రభావం చూపించాయి. దీంతో కాలిఫోర్నియా వెస్ట్ కోస్ట్ జీవనశైలికి రతన్ టాటా ఎక్కువగా ప్రభావితమై, లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడేందుకు సన్నాహాలు చేసుకున్నారు. అదే సమయంలో ఆయన అమ్మమ్మ గురించి షాకింగ్ న్యూస్ తెలిసింది.


కారణమిదే

రతన్ టాటా అమ్మమ్మ నవాజ్‌బాయి ఆర్. టాటా(vavajbai ratan tata) ఆరోగ్యం అకస్మాత్తుగా క్షిణించింది. ఈ విషయం తెలిసిన రతన్ టాటా విదేశాల నుంచి భారత్ వచ్చేశారు. ఆయనకు అమ్మమ్మ నవాజ్‌బాయి అంటే ఎంతో ఇష్టం. ఆమెతో ఎంతో ఆప్యాయంగా గడిపేవారు. ఈ విధంగా ఇండియా వచ్చి ఇక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో రతన్ టాటాకు IBM నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. కానీ JRD టాటా సంతోషించలేదు.

జాబ్ ఆఫర్

రతన్ టాటా రెజ్యూమ్ పంపిన తర్వాత 1962లో గ్రూప్ ప్రమోటర్ కంపెనీ అయిన టాటా ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం ఇచ్చింది. రతన్ టాటా 1963లో టిస్కో, ఇప్పుడు టాటా స్టీల్‌లో చేరడానికి ముందు, ప్రస్తుతం టాటా మోటార్స్ అని పిలువబడే టెల్కోలో ఆరు నెలలు పనిచేశారు. ఆ తర్వాత ఆయన 1965లో టిస్కో ఇంజనీరింగ్ విభాగంలో టెక్నికల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 1969లో ఆస్ట్రేలియాలో టాటా గ్రూప్ రెసిడెంట్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.


ప్రముఖల సంతాపం

రతన్ టాటా మృతితో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్‌ చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ రతన్ టాటా జీ దార్శనికత కలిగిన వ్యాపార నాయకుడని, అసాధారణ వ్యక్తి అని ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో పేర్కొన్నారు. దీంతోపాటు అనేక మంది ప్రముఖులతోపాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి


IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి



Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 10 , 2024 | 07:32 AM