ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ratan Tata: అనారోగ్యం వార్తలపై స్పందించిన రతన్ టాటా.. క్లారిటీ

ABN, Publish Date - Oct 07 , 2024 | 12:58 PM

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాను సోమవారం తెల్లవారుజామున బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఆయన అనారోగ్యంపై వచ్చిన వార్తలపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

Ratan Tata

దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. రక్తపోటు తగ్గిన నేపథ్యంలో ICUలో నిపుణుల బృందం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని వెలుగులోకి వచ్చింది. ఈ వార్తలపై టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ నావల్ టాటా (86) స్వయంగా స్పందించారు. ఆయన బాగానే ఉన్నారని, సాధారణ రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు చెప్పారు. తనను ఐసీయూలో చేర్చారనే వాదనలు పుకార్లేనని ఆయన పేర్కొన్నారు. ఏమి చింతించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. నేను బాగానే ఉన్నానని, ప్రజలు, మీడియా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని అభ్యర్థిస్తున్నట్లు వెల్లడించారు.


దూరదృష్టి

రతన్ టాటా 1937 డిసెంబరు 28న ముంబైలో జన్మించారు. ఆయన టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జామ్‌సెట్‌జీ టాటా మునిమనవడు. 1990 నుంచి 2012 వరకు గ్రూప్ ఛైర్మన్‌గా, అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా గ్రూపు ఛారిటబుల్ ట్రస్టులకు రతన్ అధిపతిగా కొనసాగుతున్నారు. 1962లో టాటా గ్రూప్‌లో చేరినప్పుడే టాటా అసలు కథ మొదలైంది. 1990లో గ్రూప్ ఛైర్మన్ కాకముందు వివిధ పదవులు నిర్వహించి క్రమంగా వ్యాపార మెట్లు ఎక్కారు. ఆయన పదవీ కాలంలో టాటా గ్రూప్ దేశీయంగా, విదేశాలలో గణనీయమైన వృద్ధిని, విస్తరణను సాధించింది. టాటా దూరదృష్టి, వ్యూహాత్మక ఆలోచనలు కంపెనీని టెలికాం, రిటైల్, ఆటో వంటి కొత్త పరిశ్రమలలోకి విస్తరించే స్థాయికి చేరాయి.


నాయకత్వంలో

రతన్ టాటా నాయకత్వంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూని జారీ చేసింది. టాటా మోటార్స్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయబడింది. 1998లో టాటా మోటార్స్ మొట్టమొదటి ఆల్ ఇండియన్ ప్యాసింజర్ కారు టాటా ఇండికాను పరిచయం చేసింది. తదనంతరం టాటా టీ టెట్లీని కొనుగోలు చేసింది. టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేసింది. టాటా స్టీల్ కోరస్‌ను కొనుగోలు చేసింది. ఇది భారతీయ పరిశ్రమలో టాటా గ్రూప్ ఖ్యాతిని బాగా పెంచింది. టాటా నానో ప్రపంచంలోనే అత్యంత చౌకైన ప్యాసింజర్ కారు ఇది కూడా రతన్ టాటా ఆలోచన ఫలితమే.

హార్వర్డ్

డిసెంబర్ 28, 2012న ఆయన టాటా గ్రూప్ అన్ని కార్యనిర్వాహక బాధ్యతల నుంచి పదవీ విరమణ చేశారు. టాటా ఇప్పుడు పదవీ విరమణ చేసినప్పటికీ, ఆయన ఇప్పటికీ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇటీవల ఆయన భారతీయ ఇ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్‌లో తన వ్యక్తిగత పెట్టుబడిని పెట్టాడు. దీంతో పాటు ఆయన మరో ఈ -కామర్స్ కంపెనీ అర్బన్ లాడర్, చైనీస్ మొబైల్ కంపెనీ షియోమీలో కూడా పెట్టుబడి పెట్టారు. రతన్ టాటా హార్వర్డ్ నుంచి చదువుకున్నారు. 2010 సంవత్సరంలో ఆయన హార్వర్డ్‌కు 50 మిలియన్ డాలర్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. దీని కారణంగా అక్కడ ఒక కార్యనిర్వాహక కేంద్రం ప్రారంభించబడింది. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు


అనేక అవార్డులు

టాటా అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి 2008లో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేయడం. ఇది టాటా గ్రూప్ చరిత్రలో ఒక ముఖ్యమైన నిర్ణయం. రతన్ టాటా తనకు అప్పగించిన వారసత్వాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లారు. ఎయిర్ ఇండియాను తన సామ్రాజ్యంలో చేర్చుకున్నారు. దీంతోపాటు దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యత పట్ల ఆయనకున్న అంకితభావం భారతదేశ రెండు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌తో సహా లెక్కలేనన్ని గౌరవాలను దక్కించుకునేలా చేశాయి.


ఇవి కూడా చదవండి:

Viral Video: జోమాటో కంపెనీ ఓనర్‌కు మాల్‌లోకి నో ఎంట్రీ.. అసలేం జరిగిందంటే..


Bhavish Aggarwal: కమెడియన్‌పై ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ గరం గరం.. నెటిజన్ల కామెంట్స్



IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 07 , 2024 | 01:36 PM