TRAI: కోటికిపైగా ఫేక్ మొబైల్ కనెక్షన్‌లు తొలగింపు.. కారణమిదే..
ABN , Publish Date - Sep 11 , 2024 | 07:24 AM
దేశవ్యాప్తంగా స్పామ్ కాల్ సమస్యలను అరికట్టడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కోటికి పైగా నకిలీ మొబైల్ కనెక్షన్‌లు డిస్‌కనెక్ట్ చేయబడ్డాయి. అనుమానాస్పద కాల్‌లు, సందేశాలను పంపించే అనేక ఫేక్ నంబర్లను పౌర కేంద్రీకృత ప్లాట్‌ఫాం సంచార్ సాథి తొలగించింది.
వినియోగదారులకు టెలికాం సేవల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కోటికి పైగా నకిలీ మొబైల్ కనెక్షన్‌లు డిస్‌కనెక్ట్ చేయబడ్డాయి. అనుమానాస్పద కాల్‌లు, సందేశాలను పంపించే అనేక ఫేక్ నంబర్లను పౌర కేంద్రీకృత ప్లాట్‌ఫాం సంచార్ సాథి (https://sancharsaathi.gov.in)తొలగించింది. దీనిని సైబర్ మోసం వంటి అంశాలను ఎదుర్కోవడానికి DoT ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంచార్ సాథీ సహాయంతో ఇప్పటివరకు 1 కోటికి పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్‌లు డిస్‌కనెక్ట్ చేయబడ్డాయని అధికారులు వెల్లడించారు.
మోసం
ఇది కాకుండా, సైబర్ క్రైమ్/ఆర్థిక మోసాలకు పాల్పడిన 2.27 లక్షల మొబైల్ హ్యాండ్‌సెట్‌లు కూడా బ్లాక్ చేయబడ్డాయని అధికారులు అన్నారు. గత 15 రోజుల్లో 3.5 లక్షలకు పైగా అలాంటి నంబర్‌లు డిస్‌కనెక్ట్ చేయబడ్డాయి. 50 ఎంటిటీలు బ్లాక్‌లిస్ట్ చేశారు. అదనంగా దాదాపు 3.5 లక్షల ఉపయోగించని/ధృవీకరించబడని SMS హెడర్‌లు, 12 లక్షల కంటెంట్ టెంప్లేట్‌లు కూడా నిషేధించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా స్పామ్ కాల్ సమస్యలను అరికట్టడానికి, రోబోకాల్స్, ప్రీ రికార్డ్ కాల్‌లతో సహా అనేక బల్క్ కనెక్షన్‌లను ఉపయోగించే ఎంటిటీలను డిస్‌కనెక్ట్ చేసి బ్లాక్‌లిస్ట్ చేయమని TRAI టెలికాం ఆపరేటర్‌లను ఆదేశించింది.
అక్టోబర్ 1 నుంచి
నెట్‌వర్క్ పనితీరును మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో నెట్‌వర్క్ పారామీటర్లు, కాల్ డ్రాప్ రేట్, ప్యాకెట్ డ్రాప్ రేట్ మొదలైన కీలక నెట్‌వర్క్ పారామీటర్‌ల బెంచ్‌మార్క్‌లను క్రమంగా కఠినతరం చేస్తున్నారు. దీనికి సంబంధించి TRAI సవరించిన నియమాలు, సర్వీస్ క్వాలిటీ ఆఫ్ యాక్సెస్ (వైర్‌లైన్, వైర్‌లెస్), బ్రాడ్‌బ్యాండ్ (వైర్‌లైన్, వైర్‌లెస్) సేవల నిబంధనలను జారీ చేశారు. ఈ నియమాలు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. ఏప్రిల్ 1, 2025 నుంచి మొబైల్ సేవల QoS పనితీరు త్రైమాసిక పర్యవేక్షణకు బదులుగా నెలవారీ ప్రాతిపదికన పర్యవేక్షించబడుతుందని ట్రాయ్ తెలిపింది.
పరిష్కారం
ముందుగా నిర్ణయించిన పరిమితుల కంటే ఎక్కువగా ఫిర్యాదులు అందితే, నమోదు కానీ టెలిమార్కెటర్ల సేవలను తక్షణమే నిలిపివేస్తారు. ఆ క్రమంలో అనుమానిత స్పామర్‌లను చురుగ్గా గుర్తించడం, వెంటనే చర్యలు తీసుకోవడం వంటిది జరుగుతుంది. ఈ నిబంధనలపై TRAI ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో దేశంలో టెలికాం వినియోగదారులకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవల నాణ్యత, ఫిర్యాదుల పరిష్కారానికి భరోసా కల్పించడమే లక్ష్యంగా DoT, TRAI నిరంతరం కృషి చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు
Swiggy IPO: త్వరలో స్విగ్గీ ఐపీఓ.. ఎన్ని కోట్ల షేర్లు, ఎప్పటి నుంచంటే..
Read MoreBusiness News and Latest Telugu News