ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SEBI: ఇన్వెస్టర్లను హెచ్చరించిన సెబీ.. వీటికి దూరంగా ఉండాలని సూచన

ABN, Publish Date - Dec 09 , 2024 | 09:49 PM

స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టేవారి ఆసక్తి కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే రిజిస్టర్ కాని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లను కోరుతూ సెబీ ఇటివల సర్క్యూలర్ జారీ చేసింది.

sebi

మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారిని హెచ్చరించింది. అన్‌లిస్టెడ్ సెక్యూరిటీలను (Unlisted Securities) ఆఫర్ చేస్తున్న రిజిస్టర్ కానీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు ఇన్వెస్టర్లు దూరంగా ఉండాలని సెబీ స్పష్టం చేసింది. ఆలాంటి ప్లాట్‌ఫారమ్‌ల ప్రమాదాల గురించి పెట్టుబడిదారులకు SEBI హెచ్చరిక జారీ చేసింది.

తగినంత యంత్రాంగం లేదు

అలాంటి ప్లాట్‌ఫారమ్‌లు ఎలాంటి నియంత్రణ లేదా పర్యవేక్షణ కిందకు రావని సెబీ తెలిపింది. వీటిలో ప్రాథమిక పెట్టుబడిదారుల రక్షణ లేదా పెట్టుబడిదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి యంత్రాంగాలు లేవని ప్రస్తావించింది. అందువల్ల పెట్టుబడిదారులు అటువంటి నమోదుకానీ ప్లాట్‌ఫారమ్‌లలో లావాదేవీలను నివారించాలని సూచించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లేదా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ద్వారా అధికారం పొందిన ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహించే SEBI నమోదిత స్టాక్ బ్రోకర్ల ద్వారా మాత్రమే లావాదేవీలు జరపాలని పెట్టుబడిదారులకు తెలిపింది.


నిబంధనల ఉల్లంఘన

ఇలాంటి క్రమంలో రిజిస్టర్ కాని ప్లాట్‌ఫారమ్‌లపై లావాదేవీలకు సంబంధించిన వివాదాల్లో పెట్టుబడిదారులకు తగిన సహాయం చేయడం కూడా కష్టతరంగా మారుతుందని మార్కెట్ రెగ్యులేటర్ వెల్లడించింది. అలాంటి ప్లాట్‌ఫారమ్‌లు కంపెనీల చట్టం 2013, నాన్-కన్వర్టబుల్ సెక్యూరిటీలు, మార్కెట్ పద్ధతులపై సెబీ నిబంధనలతో సహా అనేక చట్టాలను ఉల్లంఘిస్తాయని SEBI తెలిపింది.


సెబీ ఆందోళన

నియంత్రణ పర్యవేక్షణ లేకపోవడం: ఇటువంటి ప్లాట్‌ఫారమ్‌లు SEBIచే నియంత్రణ పర్యవేక్షణకు లోబడి ఉండవు. ఇది పెట్టుబడిదారులను తీవ్రమైన నష్టాలకు గురిచేస్తుందని సెబీ మరోసారి తెలిపింది. పెట్టుబడిదారుల రక్షణ లేకపోవడం: ఈ ప్లాట్‌ఫారమ్‌లలో చేరిన పెట్టుబడిదారులు రిజిస్టర్డ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పెట్టుబడి పెట్టే వారికి సమానమైన రక్షణను పొందలేరు.

పెట్టుబడిదారులకు సలహా

లిస్టెడ్ డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేయడానికి ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫారమ్ ప్రొవైడర్లుగా (OBPPs) వ్యవహరించడానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) లేదా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఉన్నాయి. వీటిలో గుర్తింపు పొందిన SEBI-నమోదిత స్టాక్ బ్రోకర్లచే నిర్వహించబడే ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించాలని మార్కెట్ రెగ్యులేటర్ పెట్టుబడిదారులకు సూచించింది. ఈ క్రమంలో BSE, NSE అధీకృత OBPPల జాబితాను https://www.sebi.gov.in/online-bond-platform-providers.htmlలో చూడవచ్చని తెలిపింది.


జాగ్రత్త వహించండి

ఇలాంటి క్రమంలో ఇన్వెస్టర్లు నమోదు చేయని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జాబితా చేయని రుణ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడాన్ని నివారించాలని సూచించారు. పెట్టుబడిదారులు BSE లేదా NSE ద్వారా అధికారం పొందిన SEBI రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్లచే మాత్రమే ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించాలని స్పష్టం చేసింది. అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించండి: పెట్టుబడిదారులు ఏదైనా అనుమానాస్పదంగా గమనించినట్లయితే, వారు వెంటనే మార్కెట్ నియంత్రణ సంస్థకు తెలుపాలని తెలిపింది.


ఇవి కూడా చదవండి:

Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..


RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం.. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా


Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Next Week IPOs: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. వచ్చే వారం ఏకంగా 11 ఐపీఓలు..

Free Government Schemes: ఉచిత పథకాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక శాఖ.. కారణమిదే..

Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 09 , 2024 | 09:51 PM