Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్
ABN , Publish Date - Apr 11 , 2024 | 02:27 PM
ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరిగే శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణలోని భద్రాచలం(bhadrachalam) శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు ఏప్రిల్ 9న మొదలు కాగా, ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్(secunderabad) నుంచి భద్రాచలం(bhadrachalam) పుణ్యక్షేత్రానికి ట్రైన్(train) రూట్ ద్వారా ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చుద్దాం.
ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరిగే శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణలోని భద్రాచలం(bhadrachalam) శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు ఏప్రిల్ 9న మొదలు కాగా, ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. అత్యంత ప్రసిద్ధమైన ఈ పుణ్యక్షేత్రంలో జరిగే వేడుకలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్(secunderabad) నుంచి భద్రాచలం(bhadrachalam) పుణ్యక్షేత్రానికి ట్రైన్(train) రూట్ ద్వారా ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చుద్దాం.
అయితే మణుగూర్, బీదర్, క్రిష్ణ, ఇంటర్ సిటీ, శాతవాహన, చార్మినార్, గౌతమి, గోల్కోండ వంటి ఇతర ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు(express trains) భద్రాచలం వెళ్లేందుకు సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైన్ల ద్వారా కనీసం రూ.200తో రామాలయం టూర్ కోసం వెళ్లవచ్చు. అయితే ఈ రైళ్లు భద్రాచలం వరకు నేరుగా వెళ్లే అవకాశం లేదు. డోర్నకల్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి మళ్లీ బస్ రూట్ ద్వారా భద్రాచలం చేరుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు ఇప్పటికే తిరుకల్యాణ బ్రహోత్సవాల సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండల నుంచి భక్తుల రక్షణ కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు తలంబ్రాల పంపిణీ, ప్రసాదాల విక్రయం, గోదావరి స్నాన ఘట్టాల వద్ద భద్రత, తాగునీటి, వసతి సదుపాయం వంటి ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. ఏప్రిల్ 17న శ్రీసీతారామ తిరుకల్యాణ మహోత్సవం(sri rama navami) జరగనుంది. ఏప్రిల్ 20, తెప్పోత్సవం, ఏప్రిల్ 21న ఊంజల్ ఉత్సవం, సింహ వాహన సేవ, ఏప్రిల్ 22న వసంతోత్సవం, ఏప్రిల్ 23న చక్ర తీర్థం, పూర్ణాహుతి, పుష్పయాగం కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి:
Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఎన్నికల తర్వాత..
EPFO: అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్.. ప్రయోజనాలు ఏంటంటే
మరిన్ని బిజినెస్ వార్తల కోసం