Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. గంటల వ్యవధిలో రూ.4 లక్షల కోట్లు ఆవిరి
ABN, Publish Date - Aug 02 , 2024 | 03:05 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుని రికార్డు సృష్టించగా, నేడు(శుక్రవారం) మాత్రం భారీగా పతనమైంది. సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.50 గంటల నాటికి సెన్సెక్స్ 890 పాయింట్ల నష్టపోయి 80,977 పరిధిలో ఉండగా, నిఫ్టీ 50 సూచీ 288 పాయింట్లు కోల్పోయి 24,722 స్థాయికి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుని రికార్డు సృష్టించగా, వారాంతమైన నేడు (శుక్రవారం) మాత్రం భారీగా పతనమయ్యాయి. సూచీలు మొత్తం నష్టాల్లో పయనించాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.50 గంటల నాటికి సెన్సెక్స్(sensex) 890 పాయింట్ల నష్టపోయి 80,977 పరిధిలో ఉండగా, నిఫ్టీ 50(nifty) సూచీ 288 పాయింట్లు కోల్పోయి 24,722 స్థాయికి చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 502 పాయింట్లు దిగజారింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, ఆసియా మార్కెట్ల క్షీణత కారణంగా భారత స్టాక్ మార్కెట్‌లో భారీ అమ్మకాలు కనిపిస్తున్నాయి.
ఈ స్టాక్స్ ప్రధానంగా..
ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఇంధన రంగ షేర్లు అత్యధికంగా పడిపోయాయి. ఈ క్షీణత కారణంగా బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ విలువ రూ.4.26 లక్షల కోట్లు తగ్గింది. ఆ తర్వాత రూ.457.36 లక్షల కోట్లకు చేరుకుంది. నిఫ్టీ మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ అత్యధికంగా 2%నికిపైగా పడిపోయాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 కూడా 1% పైగా నష్టపోయాయి.
జొమాటో
కాగా ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో షేర్లు 10 శాతం పెరగడం విశేషం. జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభం అనేక రెట్లు పెరిగింది. దీంతో ఈ షేర్లు పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి, టాటా మోటార్స్, JSW స్టీల్, హిందాల్కో కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, దివిస్ ల్యాబ్స్, HDFC బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి.
మార్కెట్ ఎందుకు పడిపోయింది?
గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.78 శాతం పెరిగి US$80.14 వద్ద ట్రేడవుతున్నాయి. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) గురువారం క్యాపిటల్ మార్కెట్‌లో కొనుగోలుదారులుగా మిగిలిపోయారు. ఆ క్రమంలో రూ.2,089.28 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. కానీ అమెరికా మార్కెట్ల పతనం తర్వాత భారత ఈక్విటీ మార్కెట్ కూడా పతనమైంది. బలహీనమైన తయారీ డేటా కారణంగా US స్టాక్స్ పడిపోయాయి. ఇది US ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై సందేహాలను పెంచింది.
దీంతోపాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలను బలహీనపరిచింది. ఆసియా మార్కెట్లలో చైనా షాంఘై కాంపోజిట్, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్, జపాన్‌కు చెందిన నిక్కీ, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ భయాందోళనలు భారత స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించాయి.
ఇవి కూడా చదవండి:
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
ITR Filling: ఐటీఆర్ దాఖలుకు నేడే లాస్ట్ ఛాన్స్.. గడువు పెంచుతారా, క్లారిటీ
Read More Business News and Latest Telugu News
Updated Date - Aug 02 , 2024 | 04:31 PM