ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: 582 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. ఈ షేర్లలో భారీ పతనం

ABN, Publish Date - Aug 08 , 2024 | 04:28 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం (ఆగస్టు 8న) రోజంతా హెచ్చుతగ్గులకు లోనై చివరకు నష్టాలతో(losses) ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 582 పాయింట్లు పతనమై 78,886 వద్ద ముగిసింది. నిఫ్టీ(nifty) 181 పాయింట్లు పతనమై 24,117 వద్దకు చేరుకుంది. నిఫ్టీ బ్యాంక్ 38 పాయింట్లు పెరిగి 50,157 వద్ద స్థిరపడింది.

Sensex fell by 582 points

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం (ఆగస్టు 8న) రోజంతా హెచ్చుతగ్గులకు లోనై చివరకు నష్టాలతో(losses) ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 582 పాయింట్లు పతనమై 78,886 వద్ద ముగిసింది. నిఫ్టీ(nifty) 181 పాయింట్లు కోల్పోయి 24,117 వద్దకు చేరుకుంది. నిఫ్టీ బ్యాంక్ 38 పాయింట్లు పెరిగి 50,157 వద్ద స్థిరపడింది. దీంతోపాటు నిఫ్టీ మిడ్ క్యాప్ 150 సూచీ కూడా 193 పాయింట్ల నష్టపోయి 56,681 స్థాయికి చేరుకుంది. RBI పాలసీ రోజున సెన్సెక్స్, నిఫ్టీ క్షీణతతో ముగియడం విశేషం. అత్యంత అస్థిరమైన సెషన్‌లో భారతీయ బెంచ్‌మార్క్ సూచీ నిఫ్టీ 24,100 దిగువన ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 23 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలోని 50 షేర్లలో 39 షేర్లు దిగువకు పయనించాయి.


టాప్ 5 స్టాక్స్

నిఫ్టీలో పడిపోయిన ప్రధాన స్టాక్‌లలో LTIMindtree, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఇదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సిప్లా పెరుగుతున్న టాప్ 5 స్టాక్‌లలో ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ 0.5% పైగా నష్టపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీల్లో ఒత్తిడి కనిపించింది. మరోవైపు భారత రూపాయి నేడు ఫ్లాట్‌గా ముగిసింది. భారత రూపాయి బుధవారం 83.95తో పోలిస్తే గురువారం డాలర్‌కు 83.96 వద్దకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అస్థిరమైన సంకేతాల కారణంగా స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


అగ్రిమెంట్

ఇదే రోజు UNICHEM ల్యాబ్ మొదటి త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన రూ.0.66 కోట్ల నష్టంతో రూ.9.25 కోట్ల లాభాన్ని ప్రకటించింది. కంపెనీ ఏకీకృత ఆదాయం రూ.423 కోట్ల నుంచి రూ.446 కోట్లకు పెరిగింది. ఇబిటా రూ.28 కోట్ల నుంచి రూ.43 కోట్లకు పెరిగింది. EBITDA మార్జిన్ 6.6% నుంచి 9.7%కి పెరిగింది. ఇదే సమయంలో మెట్రో బ్రాండ్స్‌తో దీర్ఘకాలిక లైసెన్సింగ్ ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు న్యూ ఎరా క్యాప్ ఈరోజు ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారతదేశంలో న్యూ ఎరా రిటైల్ ఉనికిని మరింత విస్తరించనుంది. అథ్లెయిజర్ మార్కెట్లో MBL రిటైల్ విస్తరణను బలోపేతం చేస్తుందని చెప్పవచ్చు. న్యూ ఎరా క్యాప్ అనేది న్యూయార్క్ ఆధారిత స్పోర్ట్స్ బ్రాండ్.


ఇవి కూడా చదవండి:

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 08 , 2024 | 04:30 PM

Advertising
Advertising
<