ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..ఒక్కరోజే రూ.14 లక్షల కోట్ల ఆదాయం!

ABN, Publish Date - May 17 , 2024 | 04:00 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) వరుసగా రెండో రోజు(మే 17న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడి 73917 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22466 పాయింట్ల వద్దకు చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్లు వృద్ది చెంది 48,116 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ ఏకంగా 452 పాయింట్లు పెరిగి 51,605 పాయింట్ల వద్ద స్థిరపడింది.

sensex gain 253 points may 17th 2024

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) వరుసగా రెండో రోజు(మే 17న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడి 73917 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22466 పాయింట్ల వద్దకు చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 139 పాయింట్లు వృద్ది చెంది 48,116 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ ఏకంగా 452 పాయింట్లు పెరిగి 51,605 పాయింట్ల వద్ద స్థిరపడింది. అయితే ప్రపంచం, దేశంలో సానుకూల సంకేతాలు మార్కెట్‌కు పాజిటివ్ ట్రెండ్‌ను తీసుకొచ్చినట్లు మార్గెట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు అమెరికా స్టాక్‌లు బాగా పుంజుకోవడంతో ఈ వారంతంలో బుల్ స్టాక్ బెట్టింగ్‌లలో ప్రభావం కనిపించింది.


ఈ ధోరణుల నేపథ్యంలో ఇండియాలో బ్యాంకింగ్, ఐటి షేర్లలో మంచి ప్రభావం కనిపించింది. ఈ క్రమంలో ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్‌లో ఆటో, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో గరిష్ట బలం నమోదైంది. ఈ క్రమంలో ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్‌లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉండగా, సిప్లా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌సీఎల్, బ్రిటానియా నిఫ్టీ టాప్ లూజర్‌లుగా నిలిచాయి.


ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లలో బలమైన కొనుగోళ్లు జరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు వరుసగా 1.18 శాతం, 1.39 శాతం చొప్పున పెరిగాయి. దీంతో శుక్రవారం(మే 17న) సెషన్‌లో మిడ్‌క్యాప్ ఇండెక్స్ 42,873.60 వద్ద సరికొత్త స్థాయిని తాకింది. దీంతో మదుపర్లు ఒక్కరోజే దాదాపు రూ.14 లక్షల కోట్లకుపైగా సంపాదించారు.


ఇది కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

SEBI: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు శుభవార్త.. ఆ రూల్స్ సడలించిన సెబీ


Read Latest Business News and Telugu News

Updated Date - May 17 , 2024 | 04:04 PM

Advertising
Advertising