ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలే కారణం

ABN, Publish Date - Aug 28 , 2024 | 10:17 AM

గత రెండు వారాలుగా స్వల్ప లాభాల్లో ట్రేడయిన స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి.

ముంబయి: గత రెండు వారాలుగా స్వల్ప లాభాల్లో ట్రేడయిన స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అలర్ట్ అవుతున్నారు. తద్వారా ఇవాళ స్టాక్ మార్కెట్ ప్రారంభం అయినప్పటి నుంచే సూచీలు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. బుధవారం ఉదయం 9.40 ప్రాంతంలో ట్రేడింగ్‌ను లాభాలతోనే మొదలుపెట్టిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 10.05 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 15.85 పాయింట్ల నష్టంతో 81,695, నిఫ్టీ (Nifty) 9.80 పాయింట్ల నష్టంతో 25,007 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

డాలర్‌తో రూపాయి విలువ 2 పైసలు క్షీణించి 83.95 వద్ద కొనసాగుతోంది.


నష్టాల బాటలో ఇవి..

నిఫ్టీలో లాభాల్లో ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, టైటాన్‌ కంపెనీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ఉండగా.. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హీరో మోటార్స్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఓఎన్జీసీ నష్టాల్లో నడుస్తున్నాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ 100.5 పాయింట్లకు చేరింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80 అమెరికన్ డాలర్లకు చేరుకుంది.

ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.16శాతం, నాస్‌డాక్‌ 0.16శాతం, డోజోన్స్‌ 0.02 శాతం లాభపడ్డాయి. చైనా షాంఘై సూచీ 0.22శాతం, జపాన్‌ నిక్కీ 0.08శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.35శాతం మేర తగ్గిపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం, నాస్‌డాక్ 0.17 శాతం లాభపడ్డాయి.

Gold Price: మహిళలకు శుభ వార్త.. తగ్గిన బంగారం ధరలు

Updated Date - Aug 28 , 2024 | 10:17 AM

Advertising
Advertising
<