ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Market Outlook: వచ్చేవారం స్టాక్ మార్కెట్‌ తీరును నిర్ణయించే అంశాలివే..

ABN, Publish Date - Aug 04 , 2024 | 03:06 PM

మళ్లీ స్టాక్ మార్కెట్(stock market) కొత్త వారం రానే వచ్చింది. అయితే వచ్చే వారం(August 5th 2024) స్టాక్ మార్కెట్‍‌పై ప్రభావం చూపనున్న ప్రధాన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీ రేటు నిర్ణయం, స్థూల ఆర్థిక సూచీలు, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌ల ఆధారంగా రానున్న వారం మార్కెట్‌ గమనాన్ని ప్రభావితం చేస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Market Outlook next week

మళ్లీ స్టాక్ మార్కెట్(stock market) కొత్త వారం రానే వచ్చింది. అయితే వచ్చే వారం(August 5th 2024) స్టాక్ మార్కెట్‍‌పై ప్రభావం చూపనున్న ప్రధాన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వడ్డీ రేటు నిర్ణయం, స్థూల ఆర్థిక సూచీలు, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌ల ఆధారంగా రానున్న వారం మార్కెట్‌ గమనాన్ని ప్రభావితం చేస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతోపాటు విదేశీ పెట్టుబడిదారుల ట్రేడింగ్ విధానాలు, మొదటి త్రైమాసిక ఆదాయ నివేదికలు కూడా స్టాక్ మార్కెట్ దిశను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

సుదీర్ఘ కాలం స్థిరత్వం తర్వాత స్టాక్ మార్కెట్ ఇటివల బలహీనత సంకేతాలు చూస్తుందన్నారు. గ్లోబల్ హెడ్‌విండ్‌లు, వాల్యుయేషన్ ఆందోళనలు ఉన్నప్పటికీ బలమైన దేశీయ లిక్విడిటీ, మెరుగైన స్థూల ఆర్థిక దృక్పథం కారణంగా మార్కెట్ స్థితిస్థాపకంగా ఉంటుందని అంటున్నారు.


ఈ కంపెనీలు..

మరోవైపు సేవల రంగానికి సంబంధించిన HSBC PMI (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) డేటా సోమవారం ప్రకటించబడుతుంది. దేశంలో ఆగస్టు 8న జరగనున్న రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య సమీక్ష సమావేశం కీలకమని ఆర్థిక వర్గాలు అంటున్నాయి. మొదటి త్రైమాసిక ఫలితాల చివరి రౌండ్ తర్వాత మార్కెట్‌లో కొన్ని స్టాక్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ కనిపించవచ్చని వెల్లడించారు. ఇది కాకుండా మార్కెట్ దిశకు సంస్థాగత ప్రవాహం కూడా కీలకమని చెప్పారు. వచ్చే వారంలో భారతీ ఎయిర్‌టెల్, బీఈఎంఎల్, ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎంఆర్‌ఎఫ్ వంటి పెద్ద కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి.


అంచనాలివే

అధిక వాల్యుయేషన్స్‌ కారణంగా మార్కెట్‌లో కొంత బలహీనత కనిపించవచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. వచ్చే వారం RBI ద్రవ్య సమీక్ష సమావేశం వడ్డీ రేట్ల ఔట్‌లుక్‌పై కొంత హెచ్చుతగ్గులు ఉంటాయని, ప్రస్తుతానికి సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత వారం అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో 30 షేర్ల BSE సెన్సెక్స్ శుక్రవారం 885.60 పాయింట్లు లేదా 1.08 శాతం పడిపోయి 80,981.95 వద్ద ముగిసింది.

ఓ కన్నేసి..

అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 293.20 పాయింట్లు లేదా 1.17 శాతం పడిపోయి 24,717.70 పాయింట్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం తీరుపై కూడా మార్కెట్ పార్టిసిపెంట్లు ఓ కన్నేసి ఉంచాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశ్లేషకుల అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయో తెలియలంటే మాత్రం రేపటి నుంచి మొదలయ్యే స్టాక్ మార్కెట్ తీరును పరిశీలించాల్సిందే.


ఇవి కూడా చదవండి:

Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


ITR Filing: జరిమానాతో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఇన్ని నష్టాలున్నాయా..!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 04 , 2024 | 03:07 PM

Advertising
Advertising
<