ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market Updates: బీఎస్ఈలో సరికొత్త రికార్డులకు బెంచ్‌మార్క్ సూచీలు..త్వరలో ఇంకా పెరుగుతుందా..?

ABN, Publish Date - Jun 19 , 2024 | 11:30 AM

దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) నేడు (జూన్ 19న) ప్రారంభ ట్రేడింగ్‌లో హెచ్చుతగ్గులు కనిపించాయి. మార్కెట్‌లోని ప్రధాన సూచీలు పెరుగుదలతో ప్రారంభమైనప్పటికీ, మొదటి గంట తర్వాత మార్కెట్ భారీ క్షీణతను నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే నిఫ్టీ తొలిసారిగా 23,600కు మించి ప్రారంభమైంది.

BSE and nifty june 19th 2024 all time high

దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) నేడు (జూన్ 19న) ప్రారంభ ట్రేడింగ్‌లో హెచ్చుతగ్గులు కనిపించాయి. మార్కెట్‌లోని ప్రధాన సూచీలు పెరుగుదలతో ప్రారంభమైనప్పటికీ, మొదటి గంట తర్వాత మార్కెట్ భారీ క్షీణతను నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే నిఫ్టీ తొలిసారిగా 23,600కు మించి ప్రారంభమైంది. ఇది ఆల్ టైమ్ గరిష్ట(all time high) స్థాయి 23,630కి చేరుకుంది. సెన్సెక్స్ కూడా కొత్త రికార్డు గరిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది. మొదటిసారిగా 77,500 దాటింది. ప్రపంచ మార్కెట్ నుంచి బలమైన సంకేతాల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్ గ్రీన్‌లో ప్రారంభమైంది.


ఈ క్రమంలోనే ఉదయం 11: 15 గంటల ప్రాంతంలో బీఎస్‌ఈ(BSE) సెన్సెక్స్ (sensex) 42 పాయింట్లు క్షీణించి 77,258 వద్దకు చేరుకుంది. అదే సమయంలో నిఫ్టీ(nifty) 50లో కూడా క్షీణత కనిపించింది. అది 55 యింట్లు పడిపోయింది. మరోవైపు నిఫ్టీ మిడ్ క్యాప్(nifty mid cap) సూచీ ఏకంగా 500 పాయింట్లు తగ్గి 54598 స్థాయిలో ట్రేడవుతోంది. కానీ నిఫ్టీ బ్యాంక్(bank nifty) మాత్రం 607 పాయింట్ల లాభంతో 51,048వద్ద కదులుతోంది. కేంద్ర బడ్జెట్ 2024కు ముందే స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త గరిష్టాలను తాకుతుంటే బడ్జెట్ వేళ ఈ సూచీలు మరింత పెరుగుతాయని నిపుణులు అంటున్నారు.


దీంతో ప్రస్తుతం ఇండస్‌ఇండ్, ICICI, HDFC, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, టైటాన్ కంపెనీ, కోల్ ఇండియా, LTIMindtree, అదానీ ఎంటర్‌ప్రైస్, BPCL సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్లలో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.25 శాతం వరకు పెరిగి రికార్డు గరిష్టాలను తాకాయి.

సెక్టార్లలో నిఫ్టీ మెటల్ టాప్ పెర్ఫార్మింగ్ ఇండెక్స్‌గా (0.4 శాతం పెరిగింది), నిఫ్టీ ఎఫ్‌ఎంసిహెచ్ (0.35 శాతం పెరిగింది), మరోవైపు నిఫ్టీ రియల్టీ 0.8 శాతం పడిపోయింది. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లలో మిశ్రమ ట్రేడింగ్ కనిపించింది. నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీలు రికార్డు ముగింపులు సాధించగా, డౌ జోన్స్‌ 56 పాయింట్లు ఎగబాకాయి. అమెరికా 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.219 శాతానికి పడిపోయింది.


ఇది కూడా చదవండి:

Saving Tips: రూ. 50 వేల నెల జీతంతో.. ఇలా కోటి ఈజీగా సంపాదించండి

Gold and Silver Rate: బంగారం ధరలు మళ్లీ తగ్గాయోచ్.. కానీ వెండి రేట్లు మాత్రం..

For Latest News and Business News click here

Updated Date - Jun 19 , 2024 | 11:35 AM

Advertising
Advertising