Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈ నిర్ణయంతో దూసుకెళ్తున్న స్టాక్స్
ABN, Publish Date - Jun 07 , 2024 | 11:25 AM
దేశీయ స్టాక్ మార్కెట్లలో(Stock Markets) ట్రేడింగ్ నేడు (జూన్ 7న) వారాంతంలో కూడా లాభాలతో దూసుకెళ్తుంది. జూన్ 4న పతనం తర్వాత మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. అయితే ఈరోజు స్వల్ప ఒత్తిడితో మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ RBI పాలసీ రేట్ల నిర్ణయం తర్వాత మార్కెట్లో లాభాల జోరు పెరిగింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో(Stock Markets) నేడు (జూన్ 7న) వారాంతంలో కూడా ట్రేడింగ్ లాభాలతో దూసుకెళ్తుంది. జూన్ 4న పతనం తర్వాత మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. అయితే ఈరోజు స్వల్ప ఒత్తిడితో మార్కెట్లు ప్రారంభమైనప్పటికీ RBI పాలసీ రేట్ల నిర్ణయం తర్వాత మార్కెట్లో లాభాల జోరు పెరిగింది. ఈ క్రమంలో సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు గబాకగా, నిఫ్టీ దాదాపు 230 పాయింట్ల మేర పెరిగింది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 350 పాయింట్లు లాభపడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 75,925 పాయింట్ల ఎగువన ఉండగా, నిఫ్టీ 23,072 పరిధిలో ఉంది.
ఈ క్రమంలో ఐటీ షేర్లలో అత్యధిక పెరుగుదల నమోదైంది. విప్రో, కోఫోర్జ్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. కానీ మెటల్, పవర్ స్టాక్స్‌లో క్షీణత కనిపించింది. సెక్టార్లలో నిఫ్టీ ఐటీ, రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా పెరగగా, నిఫ్టీ బ్యాంక్ 0.3 శాతం పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విప్రో, LTIMindtree, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5లో ఉండగా, SBI లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా, కోల్ ఇండియా, మారుతీ సుజుకి సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి.
ఇక అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను చూస్తే GIFT నిఫ్టీ శుక్రవారం (జూన్ 7) గ్రీన్‌లో ట్రేడవుతోంది. ఇండెక్స్ 22,900 పైన కొనసాగుతోంది. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లు కూడా గ్రీన్‌లోనే ఉన్నాయి. ఈ రోజు వడ్డీ రేట్ల నిర్ణయం కూడా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ నుంచి సానుకూలంగా వచ్చింది. మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ వివరిస్తూ.. వడ్డీ రేట్లను 6.5 శాతంగా అలాగే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి:
RBI: వరుసగా ఎనిమిదోసారి రెపో రేటును మార్చని RBI.. దీంతోపాటు EMI కూడా
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
For Latest News and Business News click here
Updated Date - Jun 07 , 2024 | 11:29 AM