ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Stock Markets: 623 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. సూచీల నష్టాలకు కారణమిదేనా?

ABN, Publish Date - Mar 19 , 2024 | 10:35 AM

భారతదేశ ఈక్విటీ బెంచ్‌మార్క్‌ సూచీలు మంగళవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ సహా దాదాపు సూచీలు మొత్తం నష్టాల్లోనే ఉన్నాయి. అయితే ఈ నష్టాలకు గల కారణాలేంటో ఇప్పుడు చుద్దాం.

దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) మంగళవారం (మార్చి 19న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10.30 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 623 పాయింట్లు క్షీణించి 72,120 వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 202 పాయింట్లు క్షీణించి 21,853 వద్దకు చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాపీ సూచీలు కూడా వరుసగా 211, 598 పాయింట్లు కోల్పోయాయి. అయితే అగ్రరాజ్యం అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రకటన సహా పలు అంశాల నేపథ్యంలో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.


ఈ క్రమంలో ప్రస్తుతం BPCL, TCS, సిప్లా, నెస్లే, TATA కన్య్జూమర్స్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్‌టెల్, హిందాల్కో, ICICI బ్యాంక్ వంటి సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. మరోవైపు ఈరోజు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్ ఈరోజు దాదాపు మూడు శాతానికి పైగా తగ్గుదలను నమోదు చేసింది. NSEలో ఒక్కొక్కటి రూ.4,022 కనిష్ట స్థాయికి చేరుకుంది. దీని మునుపటి సెషన్ ముగింపు ధర రూ.4,152.50తో పోలిస్తే దాదాపు 3% తగ్గడం విశేషం.

ఈరోజు కరెన్సీ మార్కెట్ గురించి పరిశీలిస్తే US డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు క్షీణించి 82.95 వద్దకు చేరుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 82.94 వద్ద ఉంది. ఇది క్రితం ముగింపు 82.90 కంటే 4 పైసలు తగ్గింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: వచ్చే ఏడాదీ ఐటీకి కష్టాలే

Updated Date - Mar 19 , 2024 | 10:35 AM

Advertising
Advertising