ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్

ABN, Publish Date - Aug 21 , 2024 | 09:37 AM

గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన బలహీన సంకేతాల నేపథ్యంలో నేడు (ఆగస్టు 21న) భారతీయ స్టాక్ మార్కెట్లు(stock markets) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దాదాపు ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఈ క్రమంలో ఉదయం 9.28 నిమిషాలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 135.61 పాయింట్లు లేదా 0.17 శాతం దిగువన 80,667.25 స్థాయిల వద్ద ప్రారంభమైంది.

stock market

గ్లోబల్ మార్కెట్ నుంచి వచ్చిన బలహీన సంకేతాల నేపథ్యంలో నేడు (ఆగస్టు 21న) భారతీయ స్టాక్ మార్కెట్లు(stock markets) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దాదాపు ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఈ క్రమంలో ఉదయం 9.28 నిమిషాలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 135.61 పాయింట్లు లేదా 0.17 శాతం దిగువన 80,667.25 స్థాయిల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 18.30 పాయింట్లు లేదా 0.07 శాతం పడిపోయి 24,680.55 స్థాయిలకు చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 235 పాయింట్లు కోల్పోయి 50,565 పరిధిలో ట్రేడైంది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ 150 సూచీ 112 పాయింట్లు పెరిగి పాజిటివ్ ధోరణిలో ఉండటం విశేషం.


టాప్ 5 స్టాక్స్

ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, HDFC బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్, భారతి ఎయిర్‌టెల్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి.


ప్రపంచ మార్కెట్‌ ఎలా

వాల్ స్ట్రీట్ ప్రధాన ఇండెక్స్‌లు S&P 500, నాస్‌డాక్ కాంపోజిట్ ఎనిమిది రోజుల వరుస లాభాలను పొందిన తర్వాత ఆసియా పసిఫిక్ మార్కెట్లు బుధవారం పడిపోయాయి. ఎస్&పి 500 0.2 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 0.33 శాతం, డౌ జోన్స్ 0.15 శాతం పడిపోయాయి. జపాన్‌లో జులై ట్రేడ్ డేటా ప్రకారం ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 10.3 శాతం పెరగగా, దిగుమతులు 16.6 శాతం పెరిగాయి. ఎగుమతుల్లో 11.4 శాతం, దిగుమతుల్లో 14.9 శాతం వృద్ధిని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.


జపాన్

ఈ క్రమంలోనే ట్రేడింగ్ డేటా విడుదలైన తర్వాత జపాన్ Nikkei 225 ఇండెక్స్ 1.57 శాతం పడిపోయింది. Topix ఇండెక్స్ 0.58 శాతం దిగజారింది. మరోవైపు దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.16 శాతం క్షీణించగా, కోస్‌డాక్ 1.16 శాతం క్షీణించింది. ఆస్ట్రేలియా S&P/ASX 200 ఇండెక్స్ 0.45 శాతం నష్టపోయింది. హాంగ్‌కాంగ్‌ హ్యాంగ్‌సెంగ్‌ సూచీ 1.01 శాతం క్షీణించి 17,333కు చేరుకుంది.


నిన్న మార్కెట్ ఎలా ఉంది?

గ్లోబల్ మార్కెట్‌లో బలమైన ధోరణి నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో స్టాక్‌లలో బలమైన కొనుగోళ్లు కనిపించాయి. ఈ కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది. ఆ క్రమంలో 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 378.18 పాయింట్లు లేదా 0.47 శాతం లాభంతో 80,802.86 వద్ద ముగిసింది. మరోవైపు NSE నిఫ్టీ 126.20 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 24,698.85 వద్ద స్థిర పడింది.


ఇవి కూడా చదవండి:

Multibagger Stock: ఒకప్పుడు ఈ స్టాక్ ధర రూ.1.80.. ఇప్పుడు రూ.357.. ఇన్వెస్టర్లకు కోట్లలో లాభం

Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..


Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 21 , 2024 | 09:40 AM

Advertising
Advertising
<