TCS: శాలరీ హైక్ ప్రకటించిన టీసీఎస్.. టాప్ పెర్ఫార్మర్‌కు ఎంతంటే..?
ABN, Publish Date - Apr 13 , 2024 | 05:20 PM
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పనితీరు ఆధారంగా శాలరీ హైక్ అందజేస్తామని ప్రకటించింది. పనిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి డబుల్ డిజిట్ ఇంక్రిమెంట్ ఇవ్వనుంది. జీతాల పెంపు అంశాన్ని కంపెనీ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ప్రకటించారు.

Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!
‘ప్రతిభ ఆధారంగా 4.5 శాతం నుంచి 7 శాతం వరకు జీతాల పెంపు ఉంటుంద. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి డబుల్ డిజిట్ ఇంక్రిమెంట్ ఇస్తాం. ఏటా ఇస్తున్నట్టే ఈ సారి కూడా జీతాలను పెంచుతున్నాం. ఈ ఏడాది 40 వేల కొత్తవారిని తీసుకోవాలని ఆలోచిస్తున్నాం అని’ మిలింద్ స్పష్టం చేశారు. జనవరి నుంచి మార్చి 2024 వరకు 1759 మంది ఉద్యోగులను తొలగించారు. మార్చి 31వ తేదీ నాటికి టీసీఎస్ కంపెనీలో 6 లక్షల వెయి 546 మంది ఉద్యోగులు ఉన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే మొత్తం ఉద్యోగుల సంఖ్య కనిష్ట స్థాయికి చేరింది.
రూ.50,000 కోట్లు దాటిన మలబార్ గోల్డ్ టర్నోవర్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం
Updated Date - Apr 13 , 2024 | 05:20 PM