LPG eKYC Updates: వంట గ్యాస్‌తో ఈకేవైసీ లింక్.. కేంద్రం కీలక ప్రకటన..
ABN, Publish Date - Jul 09 , 2024 | 03:20 PM
New Delhi: గ్యాస్ వినియోగాదారులు ఈకేవైసీ రిజిస్ట్రర్ చేసుకోవాలని, లేదంటే సబ్సిడీ కట్ అవుతుందంటూ గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటన బాగా వైరల్ అవడంతో ప్రజలు భయంతో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. మరోవైపు గ్యాస్ కంపెనీలు సైతం ఈ ప్రక్రియను ప్రారంభించడం..
New Delhi: గ్యాస్ వినియోగాదారులు ఈకేవైసీ రిజిస్ట్రర్ చేసుకోవాలని, లేదంటే సబ్సిడీ కట్ అవుతుందంటూ గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటన బాగా వైరల్ అవడంతో ప్రజలు భయంతో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. మరోవైపు గ్యాస్ కంపెనీలు సైతం ఈ ప్రక్రియను ప్రారంభించడం.. గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రమే ఈకేవైసీ రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేయడంతో.. ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే.. జనాలు గ్యాస్ ఏజెన్సీ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే, ఈ అంశంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈకేవైసీ ప్రక్రియపై క్లారిటీ ఇచ్చింది. ఈకేవైసీ లింకింగ్‌కు ఎలాంటి తుది గడువు విధించలేదని తేల్చి చెప్పారు.
కొన్ని గ్యాస్ కంపెనీలు తమ వినియోగదారులను ఈకేవైసీని పూర్తి చేయాలని.. ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెబుతున్నాయి. దీంతో వినియోగదారులను గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ శాసనసభ ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ స్పందించారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఈకేవైసీ ప్రక్రియపై క్లారిటీ ఇచ్చారు. ఈకేవైసీ రిజిస్టర్‌కు ఎలాంటి చివరి తేదీ పెట్టలేదని తేల్చి చెప్పారు.
అయితే, అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు.. బోగస్ కస్టమర్లను గుర్తించేందుకే.. ఈకేవైసీ ఆధార్ లింకింగ్ ప్రక్రియను చేపడుతున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. 8 నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. అయితే, వినియోగదారులు ఏజెన్సీల వద్దకే వెళ్లాల్సిన పని లేదని.. ఎల్‌పీజీ డెలివరీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే సమయంలోనే కస్టమర్ల వివరాలను వేరిఫై చేస్తారని చెప్పారు. వారి మొబైల్ ఫోన్లలోనే వినియోగదారుల ఆధార్ కార్డుతో గ్యాస్ బుక్ లింక్ చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. ఒకవేళ కస్టమర్లకు అవకాశం ఉంటే.. తమ దగ్గర్లోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి కూడా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చని తెలిపారు కేంద్ర మంత్రి. అంతేకాదు.. వినియోగదారులు తమ మొబైల్‌లో గ్యాస్ కంపెనీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని సొంతంగా కేవైసీని పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.
For More Business News and Telugu News..
Updated Date - Jul 09 , 2024 | 03:21 PM