Gold Rates: ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
ABN, Publish Date - May 20 , 2024 | 07:42 AM
బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. రెండురోజుల క్రితంతో పోల్చితే మేలిమి బంగారం ధర భారీగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ ముగిసినప్పటికీ బంగారానికి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధర పైపైకి వెళుతోంది.
హైదరాబాద్: బంగారం ధర (Gold Rate) మళ్లీ పెరుగుతోంది. రెండురోజుల క్రితంతో పోల్చితే మేలిమి బంగారం ధర భారీగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ ముగిసినప్పటికీ బంగారానికి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పసిడి ధర పైపైకి వెళుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో చుద్దాం. పదండి.
హైదరాబాద్‌లో సోమవారం 10 గ్రామల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68 వేల 390గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.74 వేల 610గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.68 వేల 390గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.74 వేల 610గా ఉంది. విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.68 వేల 390 కాగా, మేలిమి బంగారం ధర రూ.74 వేల 610గా ఉంది. వెండి ధర రూ.100 వరకు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, చెన్నైలో కిలో వెండి ధర రూ.96 వేల 400గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68 వేల 540గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.74 వేల 760గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.68 వేల 390గా ఉంది. మేలిమి బంగారం ధర రూ. 76 వేల 610గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.68 వేల 490గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.74 వేల 720గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.68 వేల 390గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.74 వేల 610గా ఉంది.
బంగారం ధరకు రోజు రోజుకు రెక్కలొస్తున్నాయి. ఇలానే కొనసాగితే 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.లక్షకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కిలో వెండి ధర రూ.లక్షకు చేరువ అయిన సంగతి తెలిసిందే.
Read Latest Business News and Telugu News
Updated Date - May 20 , 2024 | 07:42 AM