Gold Rates: పెరిగిన బంగారం ధర
ABN, Publish Date - Aug 01 , 2024 | 07:54 AM
బంగారం ధరలు కాస్త పెరిగాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఆ క్రమంలో గురువారం నుంచే ధరల పెరుగుదల ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్: బంగారం ధరలు (Goldrates) కాస్త పెరిగాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఆ క్రమంలో గురువారం నుంచే ధరల పెరుగుదల ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పదండి.
హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,010గా ఉంది. నిన్న అది 63,190 పలికింది. ఒక్కరోజులోనే రూ.820 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,830గా ఉంది. నిన్న 68,940గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.890 పెరిగింది. విశాఖపట్టణం, విజయవాడలో కూడా హైదరాబాద్ మాదిరిగానే ధరలు ట్రేడ్ అవుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,010 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,830గా ట్రేడ్ అవుతోంది.
భారీగా పెరిగిన బంగారం ధర..
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,160గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,980గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,010గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,830గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,210గా ఉండగా మేలిమి బంగారం ధర రూ. 70,050గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఇక్కడ అధిక ధర పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,010గా ఉండగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.69,830గా ఉంది.
బంగారం ధర | 10 గ్రాములు (22 క్యారెట్లు) | 10 గ్రాములు (24 క్యారెట్లు) |
హైదరాబాద్ | 64,010 | 69,830 |
విజయవాడ | 64,010 | 69,830 |
విశాఖపట్టణం | 64,010 | 69,830 |
ఢిల్లీ | 64,160 | 69,980 |
ముంబై | 64,010 | 69,830 |
వెండి ధర పైపైకి..
వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.86,600గా ఉంది. నిన్న 84,600గా రికార్డైంది. ఒక్క రోజులోనే రూ.2 వేలు పెరిగింది. బెంగళూర్‌లో కిలో వెండి 83,900, చెన్నైలో కిలో వెండి ధర 91,100గా ఉంది. నిన్న చెన్నైలో కిలో వెండి ధర రూ.88,900 పలికింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో వెండి ధర భారీగా పెరిగింది. ఈ రోజు కిలో వెండి ధర రూ.91,100గా ఉంది. నిన్న 88,900 పలికింది.
Read More Business News and Latest Telugu News
Updated Date - Aug 01 , 2024 | 07:54 AM