ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TRAI: ఈ టెలికాం కంపెనీలకు ట్రాయ్ భారీ ఫైన్.. కారణమిదే..

ABN, Publish Date - Dec 23 , 2024 | 10:45 AM

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పామ్ కాల్‌లు, సందేశాలను అరికట్టడంలో విఫలమైనందుకు ప్రముఖ టెలికాం కంపెనీలపై భారీ జరిమానాలు విధించింది. ఇందులో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi), BSNL వంటి కంపెనీలు కూడా ఉన్నాయి.

TRAI Fines Telecom Companies

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తాజాగా టెలికాం కంపెనీలపై భారీ జరిమానాలు విధించింది. ప్రధానంగా స్పామ్ కాల్స్, సందేశాలను అరికట్టడంలో విఫలమైనందుకు ప్రముఖ టెలికాం కంపెనీలకు ఫైన్ విధించారు. ఇందులో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi), BSNL సహా చిన్న ఆపరేటర్లు కూడా ఉన్నాయి. ఈ నిర్ణయం వినియోగదారుల అభ్యంతరాలకు సమాధానం ఇవ్వడంలో ఒక కీలకమైన అడుగుగా కనిపిస్తోంది.


ఫైన్ ఏంతంటే..

తాజాగా TRAI టెలికాం కంపెనీలపై రూ. 12 కోట్లు జరిమానా విధించింది. గతంలో జరిగిన పెనాల్టీతో కలిపి ఈ మొత్తం రూ. 141 కోట్లకు చేరింది. అయినప్పటికీ ఈ బకాయిలను కంపెనీలు చెల్లించలేదు. దీంతో, TRAI టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DoT) నుంచి బ్యాంక్ గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేసి డబ్బును తిరిగి పొందాలని అభ్యర్థించింది. అయితే DoT ఈ నిర్ణయం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.


ఆపరేటర్ల వాదన ఇలా..

స్పామ్ సమస్య ప్రధానంగా వ్యాపారాలు, టెలిమార్కెటర్ల నుంచి ఉత్పన్నమవుతుందని టెలికమ్యూనికేషన్స్ ఆపరేటర్లు వాదిస్తున్నారు. ఆపరేటర్ల నుంచి కాదు. కేవలం మధ్యవర్తులుగా ఉన్న తమకు జరిమానా విధించడం అన్యాయమని అంటున్నారు. వాట్సాప్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లతో పాటు బ్యాంకులు, ఇతర వ్యాపారాలపై స్పామ్ నియంత్రణను విధించాలని టెలికాం కంపెనీలు TRAIని కోరాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు స్పామ్ ట్రాఫిక్‌కు గణనీయంగా దోహదపడతాయని, నియంత్రణ అవసరమని చెప్పారు.


చట్టం ఆధారంగా జరిమానాలు

టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ (TCCCPR) 2010లో స్థాపించబడింది. ఇది TRAI వ్యాపారాలను, టెలిమార్కెటర్లను వినియోగదారులపై స్పామ్ కాల్‌లు, సందేశాలు పంపకుండా నియంత్రించే చర్యలు తీసుకుంటోంది. TCCCPR ప్రధానంగా వినియోగదారుల హక్కులను రక్షించడంపై దృష్టి సారిస్తుంది. ఈ చట్టం ప్రకారం టెలిమార్కెటర్లను తప్పనిసరి రిజిస్ట్రేషన్, ప్రచార కమ్యూనికేషన్‌పై సమయ పరిమితులు వంటి నియమాలు అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఉల్లంఘనలు జరిపిన వారికి జరిమానాలు విధించడం జరుగుతుంది.


ప్రస్తుత స్పామ్ సమస్యను మరింత ప్రభావవంతంగా పరిష్కరించడానికి TRAI TCCCPRను సవరించే ప్రక్రియలో ఉంది. ఈ సవరణలో OTT ప్లాట్‌ఫారమ్‌లు, వ్యాపారాలతో సహా ప్రతీ ఒక్కరూ సమానంగా బాధ్యతాయుతులుగా ఉండాలని TRAI తెలిపింది. ఈ సవరణ ప్రక్రియలో ప్రతి భాగస్వామీని అంగీకరించి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.


ఇవి కూడా చదవండి:

Next Week IPOs: ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని కంపెనీలంటే..

Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..


Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 23 , 2024 | 10:58 AM