Budget 2024: మోదీ పాలనలో బడ్జెట్ లో కీలక మార్పు.. అదేంటో మీకు తెలుసా..?
ABN, Publish Date - Feb 01 , 2024 | 12:30 PM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల ఏడాది సందర్భంగా ఇది పూర్తి బడ్జెట్ కాదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల ఏడాది సందర్భంగా ఇది పూర్తి బడ్జెట్ కాదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. అయితే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 92 ఏళ్ల సంప్రదాయ బడ్జెట్‌లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యమైనది రైల్వే బడ్జెట్. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వే బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ లో విలీనం చేశారు. భారత బడ్జెట్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. 2017కి ముందు వరకు సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్‌లను వేర్వేరుగా సమర్పించేవారు. అయితే.. మోదీ ప్రభుత్వం ఈ 92 ఏళ్ల సంప్రదాయాన్ని మార్చి సాధారణ బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్‌లను కలిపి సమర్పించడం ప్రారంభించింది.
2017కి ముందు పార్లమెంట్‌లో రెండు రకాల బడ్జెట్‌లు ప్రవేశపెట్టేవారు. ఇందులో మొదట రైల్వే బడ్జెట్ కాగా రెండోది సాధారణ బడ్జెట్. రైల్వే బడ్జెట్‌లో రైల్వేకు సంబంధించిన అన్ని అంశాలు వివరంగా ఉండేవి. సాధారణ బడ్జెట్‌లో విద్య, వైద్యం, భద్రత, ఆర్థికాభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు అండేవి. ఈ క్రమంలోనే రెండు బడ్జెట్లూ ఒకటిగా మారాయి. బ్రిటీష్ హయాంలో తొలిసారిగా 1924లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడం గమనార్హం. అప్పటి నుంచి 92 ఏళ్ల పాటు సాధారణ బడ్జెట్‌కు ఒకరోజు ముందు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయం కొనసాగింది. అయితే 2017లో మోదీ ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చి ఏటా ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రారంభించింది.
రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్‌ను విలీనం చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. బ్రిటీష్ కాలం నుంచి 92 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని మార్చాలని నీతి ఆయోగ్ సూచించింది. ఈ సూచనలతో మోదీ ప్రభుత్వం అధికారులతో చర్చలు, సంప్రదింపులు జరిపి సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయాలని నిర్ణయించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 01 , 2024 | 12:30 PM