ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market Analysis: అమెరికా ఎన్నికల వేళ రేపు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందంటే..

ABN, Publish Date - Nov 03 , 2024 | 01:41 PM

గత వారం షేర్ మార్కెట్ స్వల్పంగా పెరిగిన తర్వాత, ఇన్వెస్టర్లు ఇప్పుడు వచ్చే వారంపై కన్నేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికలు, ఫెడ్, పీఎంఐ, ఎఫ్‌ఐఐ డేటా, చమురు ధరల వంటి అంశాలు భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Stock Market Analysis november 4th

ఇటివల దీపావళి వేళ స్టాక్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ తర్వాత రేపు (సోమవారం) వీటి (stock markets) ధోరణి ఎలా ఉంటుందోనని మదుపర్లు ఆసక్తితో ఉన్నారు. ఎందుకంటే నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు వడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం, విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల కార్యకలాపాలు, దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా ఈ వారం స్టాక్ మార్కెట్ల దిశను నిర్దేశించనున్నాయి. ఈ వారం కీలక ఈవెంట్లు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


కారణాలివేనా..

ప్రధానంగా నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే అందరి దృష్టి ఉందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు. ఇది కాకుండా భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, ముడి చమురు ధరలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయన్నారు. దేశీయంగా చూస్తే రెండో త్రైమాసిక ఫలితాలు కూడా చాలా కీలకం కానున్నాయని సంతోష్ మీనా చెప్పారు.


త్రైమాసిక ఫలితాలు

దేశీయంగా డాక్టర్ రెడ్డీస్, టైటాన్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్‌తో సహా ఇతర కంపెనీలు ఈ వారం త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తాయి. అలాగే HSBC మాన్యుఫ్యాక్చరింగ్ PMI సర్వీసెస్ వంటి కీలక గణాంకాలు విడుదల కానున్నాయి. ఇవి మార్కెట్ పాయింట్ నుంచి ముఖ్యమైనవి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నిరంతర విక్రయాల కారణంగా గత నెలలో ప్రధాన సూచీలు తమ ఆల్‌టైమ్ గరిష్టాల నుంచి ఏడు శాతానికి పైగా పడిపోయాయి.


ఎన్నికల ప్రభావం

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై గ్లోబల్‌ మార్కెట్లు కొద్దిరోజుల పాటు ప్రతిస్పందిస్తాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయకుమార్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత అమెరికా స్థూల జాతీయోత్పత్తి వృద్ధి, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం వంటి అంశాలు మార్కెట్ కదలికలను ప్రభావితం చేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.


లక్ష కోట్లకు పైగా విక్రయం

గత వారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) దాదాపు రూ.14,000 కోట్లను విక్రయించారు. అక్టోబర్‌లో ఎఫ్‌ఐఐలు మొత్తం రూ.1.2 లక్షల కోట్లకు విక్రయించారు. గత నెలలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) స్టాక్ మార్కెట్‌లో రూ.1.07 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు.


నిపుణులు ఏమన్నారంటే..

నిఫ్టీ 50 ఇండెక్స్ 24,500 స్థాయిని దాటలేక పోతున్నదని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెబుతున్నారు. ప్రస్తుతం సపోర్ట్ లెవల్ 24,000 నుంచి 23,900 వరకు ఉందన్నారు. ఇది బ్రేక్ చేస్తే నిఫ్టీ తన 200 రోజుల మూవింగ్ యావరేజ్ 23,500 స్థాయికి వెళ్లవచ్చన్నారు. అదే సమయంలో 24,500 మధ్య 24,650 బలమైన నిరోధ స్థాయిలు ఉన్నట్లు వెల్లడించారు.

బ్యాంక్ నిఫ్టీ

ఈ వారం బ్యాంక్ నిఫ్టీ బలాన్ని ప్రదర్శించి 1.75 శాతం లాభంతో ముగిసిందని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్ పాలకా అరోరా చోప్రా తెలిపారు. దీని బలమైన మద్దతు 51,000 స్థాయిలో ఉందన్నారు. ఇది విచ్ఛిన్నమైతే 50,500 స్థాయిలను చూడవచ్చన్నారు. అదే సమయంలో ఎగువ స్థాయిలలో 51,800 నుంచి 52,300 వరకు రావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

UPI Services: నవంబర్‌లో రెండు రోజులు యూపీఐ సేవలు బంద్.. కారణమిదే..

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Next Week IPOs: వచ్చే వారం రానున్న స్విగ్గీ, నివా బుపా సహా కీలక ఐపీఓలు


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 03 , 2024 | 01:45 PM