ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Zomato: జొమాటో 'గ్రీన్ యూనిఫాం' నిర్ణయం ఉపసంహరించుకున్న సంస్థ

ABN, Publish Date - Mar 20 , 2024 | 10:19 AM

ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కొత్త 'ప్యూర్ వెజ్ ఫ్లీట్(Pure Veg Fleet)' నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే Zomato ఇటీవల శాఖాహారం తినే వారి కోసం ఈ సంస్థ ప్రత్యేక సేవను ప్రారంభించింది.

ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కొత్త 'ప్యూర్ వెజ్ ఫ్లీట్(Pure Veg Fleet)' నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే Zomato ఇటీవల శాఖాహారం తినే వారి కోసం ఈ సంస్థ ప్రత్యేక సేవను ప్రారంభించింది. శాఖాహార ఆహారాన్ని ఇష్టపడే కస్టమర్ల అవసరాలను తీర్చడానికి 'ప్యూర్ వెజ్ మోడ్' సేవలను ప్రారంభించింది. ఆ క్రమంలో 100 శాతం వెజ్ ఫుడ్ ఇష్టపడే వారికి స్వచ్ఛమైన వెజ్ రెస్టారెంట్ల నుంచి ఆహారం పంపిణీ చేస్తామని తెలిపారు.

వెజ్ ఫుడ్ డెలివరీ చేయడానికి, జొమాటోలో డెలివరీ వ్యక్తుల ప్రత్యేక శాఖ ఉంటుందని, దానికి ప్యూర్ వెజ్ ఫ్లీట్ అని పేరు పెట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్(Deepinder Goyal) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పేర్కొన్నారు. ఆ క్రమంలోనే వెజ్ ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తులు గ్రీన్ కలర్ డ్రెస్‌(green colour dress)తో గ్రీన్ బాక్సుల్లో పంపిణీ చేస్తారని ప్రకటించారు.


అయితే ఈ డ్రెస్ కోడ్ అంశంపై సోషల్ మీడియా(social media)లో అనేక మంది విమర్శలు చేశారు. దీంతో ఈ ప్రకటన వెలువడిన ఒక్కరోజులోనే జొమాటో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో జొమాటో వ్యవస్థాపకుడు, CEO దీపిందర్ గోయల్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. మునుపటిలాగే శాకాహారులకు కూడా మా రైడర్‌లందరూ ఎరుపు రంగు దుస్తులను ధరిస్తారని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు ఈ సమస్యలను లేవనెత్తినందుకు సోషల్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్న గోయల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Ad Revenue Program: ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఇన్ కం ప్రొగ్రామ్‌.. 1,50,000 క్రియేటర్లకు ఇప్పటికే రూ.373 కోట్లు చెల్లింపు

Updated Date - Mar 20 , 2024 | 10:20 AM

Advertising
Advertising