ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Aadhar cards: నకిలీ పత్రాలతో నేపాలీలకు ఆధార్‌ కార్డులు

ABN, Publish Date - Nov 15 , 2024 | 07:27 AM

నకిలీ పత్రాలు, స్టాంపులు, సంతకాలతో నేపాలీలకు ఆధార్‌, ఓటర్‌, జనన ధ్రువీకరణ పత్రం, పాన్‌, పాస్‌పోర్ట్‌తో పాటు ఇతర అధికారిక పత్రాలను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, మహాకాళి పోలీసులు(North Zone Task Force, Mahakali Police) కలిసి అరెస్ట్‌ చేశారు.

- పాస్‌పోర్ట్‌, పాన్‌, ఓటర్‌, బర్త్‌ సర్టిఫికెట్లు కూడా..

- ఆరుగురు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసిన టాస్క్‌ఫోర్స్‌

హైదరాబాద్‌ సిటీ: నకిలీ పత్రాలు, స్టాంపులు, సంతకాలతో నేపాలీలకు ఆధార్‌, ఓటర్‌, జనన ధ్రువీకరణ పత్రం, పాన్‌, పాస్‌పోర్ట్‌తో పాటు ఇతర అధికారిక పత్రాలను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, మహాకాళి పోలీసులు(North Zone Task Force, Mahakali Police) కలిసి అరెస్ట్‌ చేశారు. గురువారం బషీర్‌బాగ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైవీఎస్‌ సుధీంద్ర కేసు వివరాలు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బాటిల్‌ నీళ్లా.. జరదేఖో..


కళాసిగూడకు చెందిన యలగం రాజ్‌కుమార్‌(42) ప్యాట్నీ సెంటర్‌లోని శ్రీనాథ్‌ కాంప్లెక్స్‌లో ఆర్‌ఎస్‌ ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్‌ను 10 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు. నకిలీ పత్రాలను సృష్టించి ఓటర్‌, ఆధార్‌, పాన్‌, బర్త్‌సర్టిఫికెట్‌లు, పాస్‌పోర్ట్‌(Passport)లను ఇప్పిస్తున్నాడు. ఇతడికి నకిలీ పత్రాల తయారీలో కంప్యూటర్‌ ఆపరేటర్లు నామాలగుండుకు చెందిన విజయలక్ష్మి(39), రాణిగంజ్‌కు చెందిన పల్లవి(32), ఎల్‌బీనగర్‌ ఎన్టీఆర్‌ నగర్‌లో ఉంటున్న సర్వశిక్షా అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగి ఎండీ మహబూబ్‌(25), సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయం(Secunderabad GHMC Office)లో కాంట్రాక్టు కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గిరిరాజ్‌ అనిల్‌కుమార్‌(27), నామాలగుండు ప్రాంతానికి చెందిన పాస్‌పోర్ట్‌ ఏజెంట్‌ బండి శంకర్‌(48) సహకరించేవారు.


ఈ ముఠాకు అధికారుల పేరుతో నకిలీ స్టాంపులు తయారు చేసి ఇచ్చిన నేరేడ్‌మెట్‌కు చెందిన ఏ.శ్రవణ్‌కుమార్‌ను నేరేడ్‌మెట్‌ పోలీసులు గతేడాది జూన్‌లో అరెస్ట్‌ చేశారు. దీంతో అప్రమత్తమైన రాజ్‌కుమార్‌ ముఠా సభ్యులు కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని మొత్తం తొలగించారు. అయినా డాటా రికవరీ చేసిన పోలీసులు వీరి భాగోతాన్ని బట్టబయలు చేశారు.

నకిలీ పత్రాల సాయంతో 15వేల నకిలీ ఓటర్‌ ఐడీలు, 10వేల ఆధార్‌కార్డులు, 50 పాస్‌పోర్టులు, 2వేల జనన ధ్రువీకరణ పత్రాలు, 1500 పాన్‌ కార్డులు తయారు చేసినట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు.


అంతేకాకుండా వీరి కంప్యూటర్‌లలో 3,182 ఓటర్‌ ఐడీలు, 574 ఆధార్‌ కార్డులు, 365 పాన్‌కార్డులు, 6 పాస్‌పోర్ట్‌లు, 54 బర్త్‌ సర్టిఫికెట్లకు చెందిన సాఫ్ట్‌ కాపీలను గుర్తించామన్నారు. వీరు పలువురు గెజిటెడ్‌ అధికారులకు చెందిన నకిలీ స్టాంపులను తయారు చేసి, వారి సంతకాలను ఫోర్జరీ చేసేవారు. వీటి సాయంతో నేపాల్‌కు చెందిన వారికి 1000 ఓటర్‌ కార్డులు, 750 బర్త్‌ సర్టిఫికెట్లు, 1500 ఆధార్‌ కార్డులను రూపొందించి ఇచ్చారని విచారణలో గుర్తించామని డీసీపీ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: కేసు పెట్టాల్సింది.. సీఎం బ్రదర్స్‌పైనే

ఈవార్తను కూడా చదవండి: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు

ఈవార్తను కూడా చదవండి: 14 రకాల వివరాలివ్వండి..

ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల’పై ఉన్నత స్థాయి విచారణ

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2024 | 07:27 AM