ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Accident: పెళ్లి వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. 9 మంది మృతి

ABN, Publish Date - Apr 21 , 2024 | 09:15 AM

రాజస్థాన్‌(Rajasthan)లోని ఝలావర్‌(Jhalawar)లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

accident in Rajasthan a truck collided with a van in Jhalawar

రాజస్థాన్‌(Rajasthan)లోని ఝలావర్‌(Jhalawar)లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నారని అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా NH 52 పై అక్లెరా సమీపంలోకి చేరుకున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.


శనివారం రాత్రి పెళ్లి ముగించుకుని పెళ్లికి వచ్చిన అతిథులు అక్కడి నుంచి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో అక్లేరా, ఘటోలీ మధ్య పచౌలా మలుపు వద్ద పెళ్లికి వచ్చిన అతిథులతో నిండిన వ్యాన్, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పెళ్లికి వచ్చిన అతిథులంతా అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి తర్వాత పెళ్లికొడుకును ఇంటికి తిరిగి తీసుకు వస్తున్నక్రమంలోనే ఇది జరిగిందని తెలుస్తోంది.


ప్రమాదంపై సమాచారం అందుకున్న అక్లేరా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసి అక్లేరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వారిలో ఏడుగురు అక్లెరాకు చెందినవారు. ఒకరు హర్నవాడ, ఒకరు బరాత్ సరోలాకు చెందినవారిగా గుర్తించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంతో పెళ్లయిన ఇరువురి ఇళ్లలో విషాదఛాయలు అలముకున్నాయి.


ఇది కూడా చదవండి:

IPL 2024: నేడు మధ్యాహ్నం RCB vs KKR మ్యాచ్.. బెంగళూరుకు డూ ఆర్ డై మ్యాచ్


Gold and Silver Rates: నేడు స్థిరంగా గోల్డ్ రేట్లు.. కానీ గత 10 రోజుల్లో ఏకంగా..


మరిన్ని క్రైం వార్తల కోసం

Updated Date - Apr 21 , 2024 | 09:36 AM

Advertising
Advertising