Anantapur: మద్యం మత్తులో.. స్నేహితుడి దారుణహత్య..
ABN, Publish Date - Dec 24 , 2024 | 01:34 PM
మండలంలోని రావివెంకటాంపల్లి గ్రామసమీపంలో వంశీ (26) అనే యువకుడిని అతడి మిత్రులే రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారని రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి(Rural CI Sivagangadhar Reddy) తెలిపారు.
తాడిపత్రి(అనంతపురం): మండలంలోని రావివెంకటాంపల్లి గ్రామసమీపంలో వంశీ (26) అనే యువకుడిని అతడి మిత్రులే రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారని రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి(Rural CI Sivagangadhar Reddy) తెలిపారు. ఆయన తెలిపిన మేరకు రావివెంకటాంపల్లికి చెందిన వంశీ ఐషర్ డ్రైవర్(Eicher driver)గా పని చేసేవాడు. సోమవారం మధ్యాహ్నం మిత్రులతో కలిసి మద్యం సేవించడానికి గ్రామ సమీపంలోని ముళ్లపొదల్లోకి వెళ్లారు. కొంత సమయం తర్వాత వీరి మధ్య మద్యం విషయంలో గొడవపడ్డారు.
ఈ వార్తను కూడా చదవండి: Bengaluru: వయనాడ్‌లో వంద ఇళ్లు.. సీఎం లేఖకు కేరళ ముఖ్యమంత్రి సమాధానం
దీంతో కోపోద్రిక్తులైన మిత్రులు వంశీని రాళ్లతో కొట్టి చంపారని తెలిపారు. అనంతరం వీరు పరారయ్యారని సీఐ తెలిపారు. గతంలో వంశీ ఇదే గ్రామానికి చెందిన పలువురు యువకులతో ఐషర్ బాడుగ విషయంలో గొడవపడ్డాడని తెలిపారు. ఈ కోణంలో కూడా విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య అంజలి ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!
ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..
ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్ నేరగాళ్లు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 24 , 2024 | 01:34 PM