Anantapur: కబ్జా చేసి.. వైసీపీ నాయకుడి దౌర్జన్యం
ABN, Publish Date - Dec 10 , 2024 | 01:42 PM
గత వైసీపీ హయాంలో శోత్రియం భూమిని ఫేక్ రిజిస్ట్రేషన్ ద్వారా కబ్జా చేసిన వైసీపీ(YCP) నాయకుడు.. తాజాగా సర్వే చేసేందుకెళ్లిన అధికారులపై దౌర్జన్యానికి దిగాడు. తన అనుచరులను ఉసిగొల్పాడు. పెనుకొండ మండలం బొజ్జిరెడ్డిపల్లి(Bojjireddypalli)లో సర్వే నంబరు 28/2లో 28సెంట్ల శోత్రియం భూమి ఉంది.
- సర్వేకి వెళ్లిన రెవెన్యూ అధికారులు, పోలీసులతో వాగ్వాదం
పెనుకొండ(అనంతపురం): గత వైసీపీ హయాంలో శోత్రియం భూమిని ఫేక్ రిజిస్ట్రేషన్ ద్వారా కబ్జా చేసిన వైసీపీ(YCP) నాయకుడు.. తాజాగా సర్వే చేసేందుకెళ్లిన అధికారులపై దౌర్జన్యానికి దిగాడు. తన అనుచరులను ఉసిగొల్పాడు. పెనుకొండ మండలం బొజ్జిరెడ్డిపల్లి(Bojjireddypalli)లో సర్వే నంబరు 28/2లో 28సెంట్ల శోత్రియం భూమి ఉంది. భూమికి సంబంధించిన వారు లేకపోవడంతో శెట్టిపల్లికి చెందిన వైసీపీ నాయకుడు, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి కన్నేశాడు.
ఈ వార్తను కూడా చదవండి: Anantapur: అనంతపురం జిల్లాలో భారీగా గోవా మద్యం పట్టివేత
తన భార్య అర్చన పేరిట బుక్కపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం(Sub-Registrar's Office)లో 2021లో ఫేక్ రిజిస్ర్టేషన్ చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్నుంచి భూమిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. స్థలం కోసం రెవెన్యూ అధికారులు, పోలీసులు సర్వే మొదలెట్టారు. సోమవారం గ్రామంలోని శోత్రియం భూములను పరిశీలించారు. ఈ క్రమంలో కృష్ణారెడ్డి.. తన అనుచరులతో కలిసి అధికారులపై దౌర్జన్యానికి దిగాడు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి, అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
పెనుకొండ: బొజ్జిరెడ్డిపల్లిలోని శోత్రియం భూమిని సర్వే చేసేందుకు ఆర్‌ఐ భాస్కర్‌రెడ్డి, వీఆర్వో తేజారెడ్డి, సర్వేయర్ భరత్‌కుమార్, పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో కృష్ణారెడ్డి బంధువు మంజుల ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో కళ్లలోకి పెట్రోల్ పడింది. కళ్లుమంట కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్‌ఐ వెంకటేశ్వర్లును అడగ్గా.. తమకు ఫిర్యాదు అందలేదన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆశ వర్కర్లపై పోలీసుల దాష్టీకం
ఈవార్తను కూడా చదవండి: Sangareddy: సోనియా,రాహుల్ ఇచ్చిన మాట తప్పరు
ఈవార్తను కూడా చదవండి: మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి
Read Latest Telangana News and National News
Updated Date - Dec 10 , 2024 | 01:43 PM